March 28, 2013

పిటిషన్ వేయాలి: కడియం

హైదరాబాద్ : బాబ్లీకి సంబంధించి సుప్రీంతీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పామని కడియం శ్రీహరి చెప్పారు. గోదావరి జలాల వినియోగంపై ఏర్పాటయ్యే త్రిసభ్య కమిటీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే పని చేయాలని, దాని

సుప్రీం తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకమంటూ సీఎం కిరణ్‌ను ఒప్పించగలిగామని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ప్రభుత్వం కూడా ఆలోచనలో పడిందని, రివ్యూ పిటిషన్‌కు అంగీకరించిందని తెలిపారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సూచించామని వైసీపీ నేత సంకినేని వెంకటేశ్వర్ రావు చెప్పారు. కంతానపల్లి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరామన్నారు. బాబ్లీపై సర్కారుకు నిర్దిష్ట ప్రణాళిక లేదని, మళ్లీ న్యాయ సలహాకు వెళుతోందంటే తెలంగాణపై సర్కారు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని మహేందర్‌రెడ్డి ఆరోపించారు.

సుప్రీం తీర్పుపై రివిజన్ పిటిషన్ వేయాలని సూచించామని, అయితే ఇది ఎంతవరకు సాధ్యమో పరిశీలిస్తున్నారని విద్యాసాగర్‌రావు చెప్పారు. రివ్యూపిట్‌షన్ వేసినా.. జడ్జిమెంట్‌ను సుప్రీం మార్చుకోకపోతే ఏం చేయాలనే దానిపైనా ఆలోచన ఉండాలన్నారు. సుప్రీంతీర్పులో స్పష్టత లేదని, క్లారిఫికేషన్ పిటిషన్ వేయాలని సూచించామని వినోద్‌కుమార్ చెప్పారు. మహారాష్ట్ర 60 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వాడుతోందని ప్రధాని వద్దకు అఖిలపక్షంగా వెళ్లి చెబుదామని పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

అసలు సుప్రీం తీర్పులో ఏమి వచ్చిందో ప్రభుత్వానికి అవగాహన లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. నిపుణులు, ఇంజనీర్ల సలహాలతో రివ్యూ పిటిషన్ వేయాలని, కేంద్రంపై ఒత్తిడి కూడా తేవాలని సూచించారు. రివ్యూ పిటిషన్ పరిధిని విస్తృతం చేయాలని శేషగిరిరావు సూచించారు. సుప్రీంలో ప్రభుత్వం సరైన వాదన వినిపించలేదని, అందుకే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గుండా మల్లేశ్, జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. రివ్యూ పిటిషన్ వేయాలని, రాజకీయ పరిష్కారం చేయాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరామన్నారు.
ఖర్చులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలు భరించేలా ఉండాలని సూచించామన్నారు. బాబ్లీపై సుప్రీంలో ప్రభుత్వం పేలవమైన వాదనలు వినిపించిందని ధ్వజమెత్తారు. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా అనేక సమస్యలు, కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలోని 18 లక్షల ఎకరాల ఆయకట్టును కాపాడుకునేందుకు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. బాబ్లీ ప్రాజెక్టు టీడీపీ హయాంలోనే ప్రారంభమైందన్న విమర్శకు స్పందిస్తూ.. 2004 ఆగస్టులో భూమిపూజ నిర్వహించినప్పుడు, 2005లో పనులు ప్రారంభమైనప్పుడు టీడీపీ అధికారంలో లేదన్నారు.