March 28, 2013

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి


విజయనగరం టౌన్: విద్యుత్ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేఖరులతో మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు టీడీపీ హ యాంలో స్వల్పంగా పెంచితే, వామపక్షాలతో కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద దుమారం చేసిందన్నారు. అదే ప్ర భుత్వం ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలు వినియోగదారులపై భారం వేసేందుకు సిద్ధపడితే, టీడీపీ శాసన సభలో, బయట ఉద్యమిస్తోందన్నా రు.

వామపక్షనేతలు ప్రజాస్వామ్యయుతంగా నిరవధిక దీక్ష చేస్తే, వారిని అప్రజాస్వామికంగా భగ్నం చేసిందన్నారు. టీడీపీ కూడా వినియోగదారుల తరుపున రాజీలేని పోరాటం చేయాలన్న ఉద్ధేశంతోటే 24 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ హైదరాబాద్‌లోని ఓల్డ్‌క్వార్టర్స్ వద్ద నిరవధిక ధర్నాకు దిగారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న దీక్షలకు మద్ధతుగా విజయనగరంలోని కోట జంక్షన్‌లో ఈ నెల 29 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారు. ఈ నిరాహార దీ క్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పా ల్గొని విజయవంతం చేయాలని వారు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 29న విజయనగరం నియోజకవర్గ పరిధిలో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు సైలాడ త్రినా థ్, కనకల మురళీమోహన్ చెప్పారు.

పార్టీ కార్యాలయంలో వారు విలేఖర్ల తో మాట్లాడుతూ, కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద, పార్టీ కా ర్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో టీ డీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. సమావేశం లో టీడీపీ నాయకులు ఆల్తి రమణ, మ ద్దాల ముత్యాలరావు, ముద్దాడ చంద్రశేఖర్, ఆదిబాబు పాల్గొన్నారు.

సాలూరు రూరల్: విద్యుత్ సమస్యపై రాష్ట్ర రాజధానిలో దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు మద్దతుగా సాలూ రు నియోజక వర్గంలో సంఘీభావ దీక్షలను ఈ నెల 28 నుంచి చేయనున్నట్టు ఆ పార్టీ సాలూరు ఇన్‌చార్జ్జి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం తెలిపారు. కరెంట్ తీగలను తాకితే షాక్ కొట్టే రో జులు పోయావన్నారు. కరెంట్ బిల్లులను చూస్తేనే షాక్‌కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ దీక్షలకు నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.

శృంగవరపుకోట రూరల్ : విద్యుత్ సర్‌చార్జీలు తగ్గించాలని, అప్రకటిత విద్యుత్‌కోతలను నిలిపేయాలని కోరు తూ టీడీపీ ఆధ్వర్యంలో ఎస్.కోటలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బుధవారం రాత్రి టీడీపీ ముఖ్యనాయకులు శ్రీనాధుల పెదబాబు,జీఎస్.నాయుడు, రెడ్డి వెంకన్న, బుగత వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న నా యకులు మాట్లాడుతూ, ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక ప్రజలపై రకరకాల భారాలు మో పుతుందన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందుల పడుతు న్నా, వారిపై కరెంట్ సర్‌చార్జీల భారం వేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఆ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టీడీపీ తరపున పోరాటం చేస్తామన్నారు.

కరెంటు బిల్లులు దగ్ధం: ఒక బల్బు, పంకా ఉన్న నిరుపేదలకు వేల రూపాయిల బిల్లు వస్తోందని, ఇది చాలా దా రుణమని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు గతం లో వందల్లో వచ్చేవని, నేడు వేలల్లో వస్తున్నాయని నిరసిస్తూ కరెంటు బి ల్లులను దగ్ధం చే«శారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశ్వరావు, ఆదినారాయ ణ, శోభరాజ్, ప్రభ,రామకృష్ణ, సుబ్బారావు, పిరిడి సింహాచలం, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

విద్యుత్ కోతలకు నిరసనగా నేడు టీడీపీ నిరాహార దీక్ష పార్వతీపురం టౌన్ : అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం పార్వతీపురం కోర్టు వద్ద ప్రధాన రహదారిపై నిరాహార దీక్షలు చేపట్టనున ్నట్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవులు తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షలు ప్రా రంభమవుతాయని ఆయన తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమాను లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.