March 28, 2013

విద్యుత్ కోతలపై ప్రభుత్వం కన్నెర్ర


అనంతపురం అర్బన్: విద్యుత్ కోతలను నిరసిస్తూ జిల్లాలో విపక్షాలు కన్నెర జేశాయి. రైతులకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టిన వామపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలో నిరసనలు కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా టీడీపీ, వామపక్షాలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేశాయి. హిందూపురం, ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైతులను ఆదుకోవాలని ఆందోళన చేస్తుంటే అరెస్ట్ చే యడం దారుణమని ఖండించారు.

అదేవిధంగా సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు రాయదుర్గం, ఉరవకొం డ, వజ్రకరూరు, కదిరి, ఓడీ చెరువు ప్రాంతాల్లో నిరసనలు తెలిపి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లాకేంద్రంలో విపక్షాల నిరసనలు కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ ఆ ధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి టవర్‌క్లాక్ సమీపంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనలో టీడీపీ సీనియర్ నేత బుగ్గయ్య చౌదరి, జిల్లా ఉపాధ్యక్షుడు నెట్టెం వెంకటేష్, నదీం అహ్మద్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి లక్ష్మిరెడ్డి, నగర అధ్యక్షుడు సరిపూటి ర మణ, నజీర్, బోయ రమణ, డిష్ ప్రకాష్, సీవీ సుబ్బారెడ్డి, మణికంఠబాబు, యంజూరప్ప, లాయర్ గోవిందరాజులు, అశోక్‌నగర్ నారాయణస్వామి, రామచంద్ర, రియాజ్, సైఫుద్ధీన్, వెంకటాద్రి, తనకంటి జయప్ప, చెర్లోపల్లి రామకృష్ణ, బాలు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటప్పతో పాటు పలువురు పాల్గొన్నారు.

అనంతరం నాయకులు మా ట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తా రు. కరెంట్ కోతలతో రైతులు పెట్టిన పంటలు ఎండిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారన్నారు. అసలే వరుస కరువులతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలకు కరెంట్ కోతలు మరింత దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ నిరసనలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, నగర కార్యదర్శి నారాయణస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబుళకొండారెడ్డి, నగర కా ర్యదర్శి రాంభూపాల్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రైతు ప్రభుత్వమంటూ గొ ప్పలు చెప్పే పాలకులు వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కరెంట్ కోతను ఇష్టారాజ్యంగా చేస్తున్నారని పాలకులు మా త్రం మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కోతలను ఎత్తివేసి రైతులను ఇతర చేతివృత్తి కార్మికులను ఆదుకోవాలని వామపక్షాల అగ్రనేతలు నా రాయణ, రాఘవులు ఆమరణ నిరాహా ర దీక్షకు దిగితే అక్రమంగా అరెస్ట్ చేసి భగ్నం చేయ డం దారుణమన్నారు. పాలకులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.