March 28, 2013

సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా..


సుబేదారి : తెలంగాణ జిల్లాల్లో విద్యుత్ కోతలతో రైస్‌మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏప్రిల్ 22 నుంచి జరుగనున్న శాసనసభ సమావేశాల్లో ప్రస్తావిస్తానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య హామీ ఇచ్చారు. బుధవారం అమరవీరుల స్థూపం వద్ద రైస్‌మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన స్ఫూర్తి దీక్ష రెండో రోజకు చేరుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షడు ఎడబోయిన బస్వారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, మాందాడి సత్యనారాయణరెడ్డి మ ద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎ మ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ మిల్లర్లు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలను నివారించేందుకు, ప్రభుత్వం ప్ర త్యామ్నయ మార్గాలను చూపాల్సిన అ వసరం ఉందన్నారు. మిల్లర్లకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ యన పేర్కొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షడు బస్వారెడ్డి మాట్లాడుతూ రైతన్న కు అండగా ఉండే మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్షం వహించడం తగదన్నారు. అతిపెద్ద ఇండస్ట్రీ రైస్ మిల్లులకు చేయూత నివ్వాల్సిన ప్రభుత్వం, అధికారులతో వేధింపులకు గురిచేయ డం సరికాదని ఆయన పేర్కొన్నారు.

విద్యుత్‌ను అందించక పోవడంతో మిల్లులు మూతపడిపోవడంతో, వేలా ది మంది కార్మికులు ఉపాధిని కొల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లేనట్లయితే ప్రతిపక్ష పార్టీగా టీడీపీ అసెంబ్లీలో ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. విద్యుత్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలను చేపట్టి నిరసన తెలియచేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరిం చారు.

రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి అంజయ్య, ప్ర« ధాన కార్యదర్శి ఉప్పల వెంకటేశ్వర్లు, రాష్ట్ర రైస్‌మిల్లర్స్ ఉపాధ్యక్షుడు మేచినేని సంపత్‌రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి తోట సంపత్‌కుమార్, గుజ్జా ప్ర భాకర్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్‌రావు, ఇరుకుళ్ల రమేష్, మల్లయ్య తదితరులు దీక్షల్లో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా రైస్‌మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగరావు, మాజీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, తదితరులు మద్దతు పలికారు. సాయంత్రం దీక్షలను చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ కార్యదర్శి రవీందర్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు.