July 28, 2013

ఉమా అరెస్టు దారుణం

తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఏకమై పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడడాన్ని ప్రశ్నించిన
దేవినేని ఉమాను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండవ దశ జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మూలపాడు గ్రామంలో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఒక్కటై ఒకే డోర్ నెంబర్, ఇంటి పేరుతో 280 మంది ఓట్లు వేస్తూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. ఇది అన్యాయమంటూ రిగ్గింగ్‌ను అడ్డుకున్న ఏజెంట్లపై తల్లిపిల్లా కాంగ్రెస్ నేతలు పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించారని రావి ఆవేదన వ్యక్తం చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోకుండా ఏజెంట్లపై దాడి చేయడం అన్యాయమని ప్రశ్నించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని రావి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. అధికారం కోసం దొడ్డిదారిన తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు రిగ్గింగ్‌కు పాల్పడడాన్ని ఓటర్లు తిప్పికొట్టాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లంకదాసరి ప్రసాదరావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు దింట్యాల రాంబాబు, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి నూతక్కి బాలాజీ, అంగడాల సతీష్, లింగం ప్రసాద్, కామినేని శ్రీరామకృష్ణప్రసాద్, పెద్దు వీరభద్రరావు, జి. పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.