December 23, 2012

సమర్థ పాలనతోనే బంగారు భవిష్యత్తు

దేశంలో సమర్ధ వంతమైన పాలన ఉన్నప్పుడే బంగారు భవిష్యత్ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం అల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్‌లో శీనివాస రామను జయంతి ఉత్సవాల్లో , కిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దేశం అవినీతిలో కూరుకుపోవడం వల్లనే వెనుకబడుతున్నామని సమర్ధవంతమైన పాలన ఉన్నప్పుడే దేశంలో పేదవారు ఉండరన్నారు. ఎందరో మహానుభావులు పేదరికం నుండే పైకొచ్చారని, అంబేద్కర్, శ్రీనివాసరామనుజన్, అబ్దుల్ కలాం, ఎన్‌టిఆర్ లాంటి వాళ్లు బావి తరాలకు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ రాజధానిలో బస్సెక్కితే కిరాతకంగా అత్యాచారంచేయడం నీచమని, దేశంలో భయం లేకుండా పోయిందని అలాంటి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షలు అమలు చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు.

మహిళల అభివృద్ది కోసం ఆడపిల్లల సంరక్షణ కోసం అనేక పతకాలు ప్రవేశపెట్టిమని, ఆడపిల్లల ఆత్మసైర్యం నింపడానికి సైకిల్ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాకా బాల బాలికలందరికి సైకిళ్లు ఇస్తామని, అలాగే లాబ్‌టాప్‌లు కూడా అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఇంటర్మీడియెట్ సెంకండియర్‌లో జంబ్లింగ్ పద్దతిని తీసివేయాలని దీంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. అలాగే తెలంగాణ సమస్యపై కూడా పరిష్కరించాలని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావాలని, సమస్యలు పరిష్కారం కావాలని చంద్రబాబును కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలో శీనివాస రామనుజం జయంతి ఉత్సవాల్లో బాగంగా గణిత శాస్త్రం పోటీ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు చంద్రబాబు చేతుల నగదు బహుమతులను అందించారు.
No comments :

No comments :