December 23, 2012

మీ కష్టాలు తీర్చే బాధ్యత నాదే..

ఉద్యోగాలు లేవు..అభివృద్ధి లేదు..అభివృద్ధి జరిగితేనే.. ఉద్యోగాలు వస్తాయని.. ఆదాయం పెరుగుతుందని.. జీ వన ప్రమాణాలు పెరుగుతాయని.. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల మీకు కష్టాలు పెరిగిపోయాయని.. మీ కష్టా లు తీర్చే బాధ్యతను తీసుకుంటాను'.. అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. వస్తు న్నా మీ కోసం పాదయాత్రలో భాగం గా శుక్రవారం ఆయన జిల్లాలోని రామడుగు మండలం చిప్పకుర్తి, రామడుగు, షానగర్ క్రాస్‌రోడ్, గోలి రామయ్యప ల్లి, మోతె క్రాస్‌రోడ్, కోరటపల్లి, కొక్కెరకుంట «గ్రామ శివారు వరకు 14.4 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు. చిప్పకుర్తి వద్ద బసచేసిన ఆయన 12గంటల 10 నిమిషాల వరకు ఆయన చొప్పదండి నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నియోజకవర్గ నాయకులతో సంభాషించారు. అంనతరం ఎడ్లబండిపై ఎక్కి నా గలి పట్టుకుని అన్నదాత రూపం దా ల్చారు.

12:20 గంటలకు పాదయాత్ర ను ఆరంభించారు. పార్టీ జెండా ఆవిష్కరించి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయురాలి పనితీరును చూసి అభినందించారు. మార్గమధ్యంలో ఓ పొలం వద్ద మల్లవ్వ, పోశవ్వ, శంకర వ్వ, లక్ష్మి అనే మహిళా కూలీలను బా బు పలకరించగా వారు కష్టాలను ఏకరువు పెట్టారు. మోతె రిజర్వాయర్ ని ర్మాణం చేపడితే తమకు కష్టాలు తప్పవ ని భూములన్నీ ముంపునకు గురైతే కూలీపనులు దొరకవని చెప్పారు. కరెం ట్ బిల్లులు బాగా వస్తున్నాయని వాటి సంగతి చూడాలన్నారు. రామడుగు పో లీస్‌స్టేషన్ ఎదుట గల ఐకేపీ వరి ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కాంటాలో వడ్లు తూకం వేశారు. అక్కడే ఉన్న కొం దరు మహిళలు క రెంట్ బిల్లులు అడ్డగోలుగా వస్తున్నాయని వెయ్యి, రెం డు వేలు వస్తున్నాయని అవి కట్టకుం టే కరెంట్ తీస్తండ్లని..ఫైన్ వేస్తున్నార ని చెప్పారు. వ్యవసాయానికి 5 గంటల కరెంట్ కూడా వస్త లేదని, పత్తికి మద్దతు ధరలు లేవని వాపోయారు. త్వరలోనే మంచి రోజు లు వస్తాయని అన్నారు.

చౌరస్తాకు చేరుకున్న చంద్రబాబు అక్కడ జరిగిన సభ లో మాట్లాడుతూ తెలుగుదేశం హ యాంలో నిర్ధిష్టమైన ప్రణాళికతో ముం దుకు పోయి నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందించామని, నీతికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని అ న్నారు. కాంగ్రెస్ దోపిడీ, రాక్షస పాలన సాగిస్తున్నదన్నారు. ప్రజలందరూ ఇ బ్బందులు పడుతున్నారని గిట్టుబాటు ధరలు దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పత్తికి మద్దతు ధర లే దని, ఎరువుల ధరలను మాత్రం నాలుగింతలు పెంచేసి రైతుల నడ్డీ విరుస్తున్నదన్నారు. అధికారంలోకి వచ్చిన వెం టనే రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి నాణ్యమైన 9 గంటల విద్యుత్తును సరఫరా చేస్తామన్నారు. గుండెలు గు భేల్ మనేలా కరెంట్ బిల్లులు వస్తున్నాయన్నారు. వ్యవసాయానికి రోజుకు 4 గంటల విద్యుత్తు కూడా ఇవ్వడం లేదన్నారు.

రైతులు అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నార ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గడిచిన ఏడాది వరకు ఈ జిల్లాలో 817 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ప్రభుత్వం రైతుల కోసం ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ వ్యవస్థను బాగు చేయాల్సిన అవసరం ఉందని, ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తామన్నారు. సర్‌చార్జీ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశా రు. నాడు డ్వాక్రా సంఘాలు పెట్టి రివాల్సింగ్ ఫండ్ ఇచ్చి ఆదుకుంటే ప్రస్తు తం పావలావడ్డీ అని చెప్పి అడ్డగోలు వడ్డీ వసూలు చేశారని, మైక్రో ఫైనాన్స్ ల వల్ల మహిళలు అప్పుల ఊబిలో కూ రుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశా రు. మహిళలకు అండగా ఉండి మైక్రో ఫైనాన్స్‌లను ఊడబీకేలా చేశామన్నా రు. బ్యాంకు అప్పులు తీర్చే బాధ్యత తీ సుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో మహిళలకు 35 లక్షల గ్యా స్ కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు.

పెరిగిన ధరల వల్ల గ్యాస్ కొనే పరిస్థితి లేదని, నిత్యావసరాలు అన్ని పెరిగి పోయాయని నాడు 12 రూపాయలు న్న చక్కెర 42 రూపాయలకు, 2 రూపాయలున్న ఉప్పు 10 రూపాయలకు, 30 రూపాయలున్న పప్పు 75 రూపాయల కు పెరిగిందన్నారు. ఒక్క నిత్యావసరాలే కాదు అన్నీ పెరిగాయని, మీకు కష్టాలు వచ్చాయన్నారు. దీనికంతటికీ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనే కారణమన్నారు. ఈ దేశం లో డబ్బుల్లేక కాద ని, ఆ డబ్బును అం తా దోచుకుని వాళ్ల ఖజానాలు నింపుకుంటున్నారని అ న్నారు. పేదిరిక ని ర్మూలన కోసం పో రాటం చేస్తానన్నా రు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని, తెలంగాణ తె లుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. తెలంగాణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, రోడ్లు వేశామ ని, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు స్థాపించామని, 11సార్లు డీఎస్‌సీ నిర్వహించి లక్షా 65 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.

తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని.. భవిష్యత్తులోనూ వ్యతిరేకంగా పని చేయనన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రా యం చెప్పకుండా ఇతరుల అభిప్రా యం తెలుసుకుని తప్పించుకునేందుకు యత్నిస్తున్నదన్నారు. మీ ఇంట్లో పెద్ద బిడ్డగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో తె లంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, సీహెచ్ విజయరమణారావు, మాఐ ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డి, శికారి విశ్వనాథం, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కర్రు నాగయ్య, గోపు అయిలయ్య యాదవ్, గండ్ర నళిని, పుట్ట కిశోర్, పి రవీందర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, పార్టీ నాయకులు ఒం టెల మురళీ కృష్ణారెడ్డి, దామెర సత్యం, కొత్త తిరుపతి రెడ్డి, కళ్యాడపు ఆగయ్య, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, మిట్టపల్లి శ్రీనివాస్, గురువా రెడ్డి, రాష్ట్ర పరిశీలకు లు విద్యాసాగర్ రావు, చల్లోజు రాజు, మహిళా నాయకురాళ్లు అంజలిగౌడ్, అ మీనాబేగం, తదితరులు పాల్గొన్నారు.

సభను అడ్డుకునేందుకు యత్నించినటీఆర్ఎస్ కార్యకర్తలురామడుగులో చంద్రబాబు నాయు డు సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు.

జై తెలంగా ణ అంటూ ఒక్కసారిగా సభలోకి దూ సుకురావడంతో వారిని పోలీసులు సభ బయటకు తీసుకెళ్లారు. వారి మీదకు వె ళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించ గా చంద్రబాబు జోక్యం చేసుకుని పార్టీ కార్యకర్తలు ఎవరూ అటు వైపుగా వెళ్లవద్దని తెలుగుదేశం పార్టీని చూస్తే వారికి వణుకు పుడుతున్నదని అన్నారు.బాబును కలిసిన దాడి వీరభద్రరావుచంద్రబాబును శాసనమండలి టీ డీపీ సభా పక్షనేత దాడి వీరభద్రరా వు, వికారాబాద్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, అండమాన్ నికోబార్ దీవులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ మాణిక్యారా వు దీవులు, రాజకీయ విశ్లేషకులు వి మాధవ నాయుడు, ఉపాధ్యక్షులు ఆర్ నర్సింహారావు, సీహెచ్ బాబ్జీ, ప్రధాన కార్యదర్శి సంతోష్ సింగ్, తెలుగు మ హిళ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాకినేని శేషుకుమారి, తదితరులు చంద్రబాబు ను కలుసుకుని కొద్ది దూరం ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు.
No comments :

No comments :