February 21, 2013

పాదచారుల కోసం పాకశాల


 'వస్తున్నా మీ కోసం' పేరుతో చంద్రబా బు చేపట్టిన పాదయాత్రలో పాదచారులకు భోజన వసతులు చూడటంలో ఎ లాంటి ఇబ్బందు లూ లేకుండా చూ స్తుంది 'రంగనాథ్' బృందం. హైదరాబాద్‌కు చెందిన రంగనాథ్ వంటలు తయారు చేయడంలో దిట్ట. చంద్రబాబు పాదయాత్ర చేపట్టడానికి ముందు తెలుగుదేశం నాయకులు రంగనాథ్‌ను కలసి యాత్ర వివరా లు అందించి భోజన వసతి చూ డాల్సిందిగా కోరా రు. దీనికి అంగీకరించిన ఆయన పాదయాత్ర ఆరంభం నుంచి పార్టీ శ్రేణులకు పాదయాత్రలో భోజన వసతి చూస్తున్నారు. ఆరంభం నుండి నేటి వ రకు 138వ రోజు వరకు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చే స్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు.

ఉదయం మూడు రకాల అల్పాహారం

చంద్రబాబు పాదయాత్రలో పాల్గొనే కాన్వాయ్ సిబ్బందికి, ద్వితీయ శ్రేణి నాయకులకు, బాబును ఆరంభం నుంచి అనుసరిస్తున్న వారికి, భద్రతా సిబ్బందికి, పాత్రికేయులకు ఉదయం మూడు రకాల అల్పాహారా లు అందిస్తున్నారు. వేడివేడిగా ఇడ్లీ సాంబారు, దోశ, పుల్కా లేదా చపాతి, లేదా ఉప్మాలను అందిస్తున్నారు.

పౌష్టికాహారంతో కూడిన భోజనం

పాదయాత్రలో వీరంతా ఉల్లాసంగా పాల్గొనేందుకు, శరీరంలో పౌష్టికాహార నిల్వలు తగ్గకుండా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం యాత్ర ప్రారంభమయ్యే సమయానికి భోజనం ప్యాక్ చేసి వారివారి వాహనాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. భోజనంలో ఒక గుడ్డు, అరటికాయ, పెరు గు, రెండు రకాల కూరలు, పప్పుతో పాటు ఓ పచ్చడి అందుబాటులో ఉంచుతున్నారు. ఇతర ర్రాష్టాలకు చెందిన భద్రతా సిబ్బందికి, ఇతర కాన్వాయ్ సిబ్బందికి వారివారి ప్రాంతాలను బట్టి ఆహారం సమకూరుస్తున్నారు. సాయంత్రం అల్పాహారంగా బిస్కెట్లు, టీ అందిస్తున్నారు. ఇక రాత్రికి భోజనం మధ్నాహ్నం మాదిరే అందిస్తున్నారు. ఇక ఆదివారం రాత్రి సమయంలో మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిన నాన్‌వెజ్‌ను అందిస్తున్నారు.

నిత్యం 500 మందికి

రంగనాథ్ బృందం బాబు పాదయాత్రలో పాల్గొనే సుమారు 500 మందికి నిత్యం భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. సమన్వయకర్త రషీద్ ఈ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 35 మంది నిత్యం ఈ పనిలో తలమునకలై ఉంటున్నారు. వీరిలోనూ నిరంజన్, ప్రకాశ్, ఆనం ద్, నాగు, శ్రీను, శివ, రెడ్డి, అశోక్, నాగబాబు, నాయుడు, సాయిలు అందరికీ తలలో నాలుకలా మెదులుతూ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు.

పాదయాత్రలో దాహార్తిని తీరుస్తూ...


చంద్రబాబు పాదయాత్రకు సామ రంగారెడ్డి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. యాత్ర ఆరంభం నుంచి బాబు వెన్నంట రంగారెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్లు ఉంటూ పాదయాత్రలో పాల్గొనే వారికి ఉచితంగా మినరల్ వాటర్ బాటిల్స్ అందిస్తూ ముందుకు సాగుతున్నారు. యాత్ర ఆరంభం నుంచి ఇప్పటి వరకు రోజుకు 300 బాటిల్స్ అందిస్తూ వస్తున్నారు. యాత్రలో పాల్గొనే నాయకులకు, భద్రతా సిబ్బందికి, కాన్వాయ్ సిబ్బందికీ మినరల్ వాటర్ అందిస్తున్నారు. అదే విధంగా వంట ఏర్పాట్లకు అవసరమయ్యే మంచి నీరు ఉచితంగా అందిస్తున్నారు. వీటిని అందించేందుకు ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రంగారెడ్డి ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు. వీరందరినీ వంశీ కో ఆర్డినేటర్‌గా వ్యవహిరిస్తూ ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. ఈ బృందంలో శ్రీరాం, నాగరాజు, గిరి, నరేష్ తదితరులు పాల్గొంటున్నారు.