February 21, 2013

100 కి.మీ పూర్తి


చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర జిల్లాలో 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో భాగంగా జిల్లాలో ఈ నెల 6వ తేదీన తొలి అడుగు పెట్టిన చంద్రబాబు 19వ తేదీ సాయం త్రం 4 గంటలకు 100కె వాక్ పూర్తి చేశారు. ఇప్పటివరకు 7 నియోజకవర్గాలు, 9 మండలాలు, 3 మున్సిపాలిటీలు, గుంటూరు కార్పోరేషన్, 32 డివిజన్‌లు, 95 గ్రామాలలో చంద్రబాబు పాదయాత్ర సాగింది. జిల్లాలో 13 రోజుల పాదయాత్ర పూర్తయింది. ప్రజలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలవాలి 'అన్న' లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది.

పాదయాత్ర పొడవునా బారులు తీరిన ప్రజల ను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి అభయమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకటిన్నర రోజు విరామం మినహా అలుపెరగని బాటసారిలా యాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లాలో పాదయాత్రలో ఐదవ రోజు వైద్యుల సలహా మేరకు గుంటూరులో ఒక రోజు విరామం ప్రకటించారు. ఆ సమయంలో నూ తీరిక లేకుండా జిల్లా పార్టీ నాయకులతో, సహకార ఎన్నికలలో గెలిచిన అధ్యక్షులతో సమీక్షలు నిర్వహించారు. పాదయాత్రలో తొమ్మిదవ రోజు కొలకలూరులో కార్యకర్తలు ఏర్పాటు చేసిన వేదిక కూలడంతో కాలునొప్పి వలన వైద్యుల సలహా మేరకే ఒక పూట విశ్రాంతి తీసుకున్నారు. మహిళల అడుగడుగునా హారతులు, నీరాజనాలతో చంద్రబాబు పర్యటనకు ఊహకందనంత స్పందన లభిస్తోంది. తొలుత జిల్లాలో వారం రోజులు పర్యటన ఉంటుందని ప్రణాళిక తయారు చేశారు. కానీ మూడు వారాలకు కూడా పూర్తి కాకపోవడం ప్రజాస్పందనకు నిదర్శనం. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ యా త్రలో పాల్గొనడం వలన యాత్ర నెమ్మదిగా సాగుతోంది. వయ స్సు, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబునాయుడు ఊహించని జన స్పందనతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో వస్తున్న వివిధ సమస్యలపై తక్షణమే స్పందిస్తూ సంబంధిత అధికారులకు స్వయం గా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 21వతేదీ సా యంత్రం 4 గంటల వరకు తాత్కాలిక విరా మం ప్రకటించారు. ప్రతి గ్రామంలో స్థానికులు, మహిళలు, యువకులు, చిన్నారులు, విద్యార్థ్ధినులు, వృద్ధులు చంద్రబాబుకు అధిక సంఖ్య లో ఘన స్వాగతం పలుకుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా సాగునీరు, తాగునీరు, రోడ్లు, రవాణా, వైద్యం, గిట్టుబాటు ధరలు, విద్యుత్ కోతలు, సర్‌చార్జీలు, వంటగ్యాస్, రుణాలు, ఉపాధి అవకాశాలు, నిత్యావసర సరుకుల ధరల పెంపు తదితర అసౌకర్యాలపై ప్రజలు చంద్రబాబుకు ఏకరువు పెట్టారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. వేమూరు నియోజక వర్గం పూర్తి చేసుకొని రేపల్లె నియోజకవర్గంలో బాబు పర్యటించాల్సివుంది. రేపల్లె నియోజకవర్గంలోనూ బాబు పాదయాత్రకై నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలకడానికి భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విధంగా యాత్ర సాగుతుంటే మరో వారం రోజులు చంద్రబాబు జిల్లాలో ఉండే అవకాశం ఉంది.

ప్రజల్లో ఆత్మస్థైర్యం

నింపేందుకే పాదయాత్ర

జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి


ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూ స్తుంటే చంద్రబాబుకు గుండె తరుక్కుపోతుందని జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సమస్యల్లో ఉన్న ప్రజల్లో ఆత్మ స్థైర్యం నింపేందుకే చంద్రబాబు పాదయాత్ర చేస్తోన్నారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న టీడీపీకి ప్రజలు అండదండలు అందిస్తున్నారన్నారు.