October 17, 2012

చంద్రబాబు యాత్రపై జనాభిప్రాయం

ఆయనకేం తక్కువ..
జనం కోసమే తిరుగుతున్నాడు పాపం
చంద్రబాబు యాత్రపై జనాభిప్రాయం

  "ఆయనకు ఏం తక్కువ? ఇంత తిరుగుతున్నాడు. జనానికి ఏదో చేద్దామని తిరుగుతున్నాడు పాపం'' ..ఇప్పటికి పదిహేను రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్రపై హుళేబీడు గ్రామానికి చెందిన ఒక మహిళ వ్యాఖ్య ఇది. పాదయాత్ర ద్వారా చంద్రబాబు ప్రజల హృదయాల్లో తన ముద్రను ఎంతవరకు వేయగలుగుతున్నారు? ఆయన పర్యటన ప్రభావం ప్రజలపై ఏ మేరకు ఉంది? రాజకీయవర్గాల్లో చర్చనీయాంశాలుగా మారిన ఈ ప్రశ్నలకు సమాధానమీ వ్యాఖ్య. రాజకీయంగా చూపే ప్రభావం సంగతి పక్కన పెడితే 63 సంవత్సరాల వయస్సులో శ్రమకోర్చి చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర చాలామంది సానుభూతిని పొందుతోంది.

గ్రామాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు అనేక విషయాల గురించి ప్రస్తావిస్తున్నప్పటికీ విద్యుత్తు, ధరల అంశాలపై మాట్లాడినప్పుడు ప్రజల నుంచి ఎక్కువగా స్పందన కనిపిస్తోంది. అంగెన్‌సాక గ్రామంలో చంద్రబాబుతో ఒక రైతు మాట్లాడుతూ.. "ఎరువులు కొనేందుకు పెళ్లాం చెవికమ్మలు తాకట్టుపెట్టాల్సి వస్తోంది. టీడీపీ ఉన్నప్పుడు ధరలు ఇంత లేవు'' అన్నప్పుడు ఆ గ్రామస్తులు పెద్దఎత్తున చప్పట్లు చరిచారు. మొత్తం మీద బాబు యాత్ర ప్రజల్లో ఆసక్తిని పెంచుతోంది. ---( ఆంధ్రజ్యోతి )
No comments :

No comments :