October 17, 2012

ఆదోనిలో చంద్రబాబుకు నీరాజనం (16వ రోజు)17.10.2012

ప్రభుత్వం చేతగాని తనంవల్లే విద్యుత్ సంక్షోభం
నిత్యావసర వస్తులు కొనే పరిస్థితి లేదు
కాళ్లకు బొబ్బలు వచ్చినా ఆగని యాత్ర

  ప్రభుత్వం చేతగాని తనంవల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సర్కార్ పనితీరుపై మండిపడ్డారు. అధికారం కోసం పాకులాడే పార్టీలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పేద, మద్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తులు కొనుక్కునే పరిస్థితిలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రకు కర్నూలు జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం నాటికి యాత్ర 16వ రోజుకు చేరుకుంది. అయితే కర్నూలు జిల్లాలో పాదయాత్ర నాల్గవరోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సాయంత్రం చంద్రబాబు ఆదోనికి చేరుకున్నారు. అక్కడ ప్రజలు చంద్రబాబుకు నీరాజనం పలికారు. నేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్రడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలు చూశాక హైదరాబాద్ వెళ్లాలనిపించలేదని అన్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా పట్టుదల విడువదలచుకోలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఉద్యోగులకు వ్యతిరేకం కాదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అలాంటి భావనను కొందరు ఉద్యోగుల్లో ప్రేరేపించడం బాధాకరమన్నారు. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటానన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల్లో ఇళ్లు లేని వారికి స్థలాలు మంజూరు చేసి రాయితీతో నిర్మిస్తామన్నారు. వారు ఆనందంగా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తమ హయాంలో డీఎస్సీ ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రతిభావంతులకు పట్టం కట్టింది తెలుగుదేశం పార్టీనేనన్నారు. ఉద్యోగ బదిలీలకు ఓ పద్ధతిని ప్రవేశ పెట్టింది తమ పార్టీనేనన్నారు.

తమ పాలనలో ఆర్టీసీని పరిరక్షిస్తూ వచ్చామని, కాంగ్రెస్ ఆ సంస్థను దివాలా తీసిందని చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ పరిరక్షించాల్సిందిపోయి కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడే డిపోలను అమ్మకాలకు పెట్టిందన్నారు.

మీ కోసం వస్తున్నా పాదయాత్రలో చంద్రబాబు కాలినడకకు జనం పోటెత్తారు. ఆదోని చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో శ్రీనివాసభవన్ సర్కిల్ వద్దకు జన ం పోగయ్యారు. చెట్లు, భవనాలు, బస్సులు, గోడలు ఇలా జనం తప్ప మరేమీ కనిపించలేదు. ఇసుకవేస్తే రాలనంత జనాన్ని చూసి కాలినొప్పితో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు ఉత్సాహం రెట్టింపు అయింది. కాంగ్రెస్ పాలనలో నలుదిక్కుల ప్రజలు మార్పుకోసం చేస్తున్న ప్రయత్నాన్ని చంద్రబాబు అర్థం చేసుకొని తన ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.
No comments :

No comments :