October 29, 2012

జూరాలను పూర్తి చేసిన ఘనత టిడిపిదే.......సోమవారం వస్తున్నా మీకోసం యాత్రలో చంద్రబాబునాయుడు 29.10.2012

కాంగ్రెస్‌ పాలకుల నిర్ల క్ష్యం వల్లే జూరాల నిర్మాణంలో జాప్యం జరిగిందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే ఎన్టీఆర్‌ హయాంలో పనులు వేగవంతం కాగా, తాను అధికారంలో ఉన్నప్పుడు రూ.600 కోట్లు వెచ్చించి పూర్తి చేయ డం జరిగిందన్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా సోమవారం ఆయన గద్వాల నియోజక వర్గంలో పాదయాత్ర ముగించుకుని జూరాల డ్యామ్‌ మీదుగా ఆత్మకూర్‌ మండలానికి చేరుకు న్నారు. ఈ సందర్బంగా డ్యామ్‌ను ఆయన పరిశీ లించారు. పలు చోట్ల ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి పాలన కొనసా గుతున్నదని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లు ప్రభుత్వ విఐపిలకు నిలయంగా మారాయని, కాంగ్రెస్‌ పాలనలో అవి నీతి ఏ స్థాయిలో జరుగుతున్నదో ప్రత్యేకంగా చెప్పా ల్సిన అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికార కాంగ్రెస్‌ లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు తెరలేపితే, రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నార ని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక జిల్లా విషయానికి వస్తే గద్వాల, ఆత్మకూర్‌ తదితర ప్రాంతాలకు జూరాల ప్రాజెక్టు అత్యంత చేరువలో ఉన్నా, జిల్లా ప్రజాప్రతినిధులు ప్రజలకు తాగునీటిని కూడా అందించే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. ఎంత సేపు టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు సమస్యలపై దృష్టిసారించి ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుందన్నారు. గద్వాల ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉన్నా, ఇక్కడి ప్రజలకు న్యాయం చేయడం లేదని, వ్యక్తిగత ఆస్తులను పెంచుకునేందుకు తపన పడుతున్నారని విమ ర్శించారు. అదే విధంగా రాష్ట్రంలో రైతాంగం నష్టాల ఉబిలో కురుకుపోయి ఆత్మహత్యల బాట పట్టారని, చేనేత పరిశ్రమ దెబ్బతినడంతో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని చంద్రబాబు ఆందోళన చెందారు. తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించ డంతో పాటు రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రుణాలను మాఫీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్‌ను అందించి వ్యవసాయానికి పెద్దపీఠ వేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు నిరుపేదలకు విద్యనందించి ఉన్నతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. భవిష్యత్‌లో ఈ అవినీతి పాలనను ప్రజలు అంతమొందిస్తారన్న ధీమాను టిడిపి అధినేత వ్యక్తపర్చారు. యాత్రలో ఆయన వెంట పలువురు ఎమ్మేల్యేలు, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు.
No comments :

No comments :