October 25, 2012

పురోహింతులు, వేద పండితులకు గౌరవ వేతనం,అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రత్యేక చర్యలు (24వ రోజు) 25.10.2012

  అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వేదపండితులు, పురోహితులకు గౌరవ వేతనం ఇస్తామని పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇన్నాళ్లు ఏ ప్రయోజనం పొందని వర్గాలు, నిర్లక్ష్యానికి గురయిన వర్గాలు తెలుగుదేశం స్వర్ణ యుగం తేనుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పురోహింతులు, వేద పండితులకు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
మరోసారి అగ్రవర్ణాల ప్రజల గురించి బాబు ప్రస్తావిస్తూ అగ్రవర్ణాల్లో అనేకమంది పేదలున్నారని, వారు ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు నోచుకోక మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఆవేదన చెందారు. అందుకే అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రత్యేక చర్యలు తీసుకోనుందన్నారు. వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కేలా చూస్తానని అన్నారు.
చంద్రబాబు ‘ఎ ఉమెన్ ఇన్ బ్రహ్మణిజం’ సినిమాపై వ్యాఖ్యానించారు. ఒక వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలు ఉండరాదని, అది వారిపైనే కాకుండా సినిమా ఇండస్ట్రీపైన కూడా దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు.
No comments :

No comments :