October 25, 2012

రెండేళ్లలో 30 వేల పరిశ్రమలు రోడ్డున పడ్డాయి, కార్మికులకు అండగా నిలుస్తా 24వ రోజు పాదయాత్రలో చంద్రబాబు 25.10.2012

కార్మికులకు అండగా నిలుస్తా
రోడ్డున పడిన 30వేల పరిశ్రమలు
ధరలు పెంచినప్పుడు, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వద్దా?
బంగిదొడ్డి పాదయాత్రలో చంద్రబాబునాయుడు 

 

కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలవల్ల రెండేళ్లలో 30 వేల పరిశ్రమలు రోడ్డున పడ్డాయని ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు. కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందని, వారి సమస్యలపై పోరాటం చేస్తుందని బాబు హామీ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 24వ రోజు పాదయాత్రను జిల్లాలోని ఐజా నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి పత్తి మిల్లును పరిశీలించిన బాబు, కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాబు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో మొండెద్దు ప్రభుత్వం సాగుతోందని చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఎన్ని ఆందోళనలు చేసినా నిరసనలు చేసినా స్పందించడం లేదని, ప్రజలు సమస్యల సుడిగుండంలో ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

నిత్యావసర ధరలను పెంచివేశారు. మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఒక వైపు నీరు లేక పంటలు ఎండిపోయి, మరోవైపు ఎలాగోలా కష్టపడి పండించిన పంటకు సరైన ధరలేక రైతులు విలవిల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. అందుకే మీ కోసమే వచ్చాను... మీ సమస్యలు తెలుసుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అయన అన్నారు.

తాము అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు ఉచిత, నాణ్యమైన విద్యుత్ వ్యవసాయానికి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, ఢీజిల్ ధరలతో పాటు మద్యం ధరలు కూడా పెంచిందని, దొరికినదంతా దోచుకొని రాష్ట్రాన్ని స్మశానంలా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఆధాయం పెరిగినా ప్రజలు మాత్రం అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. కాగా ఈరోజు 13.5 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగనుంది. తెలంగాణలో బాబు పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఎమ్మార్‌పీఎస్ కార్యకర్తలు ఆయన వెంటే ఉంటూన్నారు.

chandrababunaidu_vastunna meekosam_padayatra
No comments :

No comments :