October 26, 2012

జైల్లో పెళ్లి రోజు జరుపుకోడానికి ఏకాంత సేవ ఏర్పాట్లు చేయలేదనే ఏడుపు గొట్టు రాజకీయ లేఖలు ఎందుకో?

జైల్లో మీ ఆయన భోగాల మీద
రేగిన దుమారానికి
విరుగుడుగా బిడ్డల
మీద ప్రమాణానికి
సవాల్ చేస్తూ
సతిగా పరిణితి లేని పసతో
ఓ లేఖ రాసారు
ప్రతిపక్షం వాళ్ళు
జైళ్ల శాఖ దగ్గర ఆరా తీస్తే
అంతెందుకు ఉలిక్కి పడ్డారు
ఆ పడేదేందో
అవినీతి మీద
ప్రాధమిక దర్యాప్తులో
వెల్లడైన వాస్తవాలతో
అరెస్ట్ అయ్యి అక్కడికి
వెళ్ళిన రోజే
ఇంటిల్ల పాది
నడి రోడ్డు మీద రక్తి కట్టించిన నాటకం లో
ఈ ప్రమాణపు సన్ని’వేషం’ పెట్టి వుంటే
ఉప ఎన్నికలలోమరింత సానుభూతి వచ్చేది కదా
అసలు సిసలు అవినీతి ఆస్తి పాస్తుల కొండంత భోగాల మీద
ఆ ఇంటి కోడలుగా కొద్దిగా దృష్టి సారించి
మడమ తిప్పకుండా ప్రమాణం చేసి వుంటే
ఊరూ వాడా అయ్యో పాపం అనేది
జైల్లో పెళ్లి రోజు జరుపుకోడానికి
ఏకాంత సేవ ఏర్పాట్లు చేయలేదనే
ఏడుపు గొట్టు రాజకీయ లేఖలు ఎందుకో?
అయినా మైనారిటీ తీరని బిడ్డల మీద ప్రమాణం అంటే
మీ మావయ్య అరిగిపోయిన రికార్డు లా చెప్పే
చట్టం తన పని తాను చేసుకు పోదూ
మీకా హక్కు ఎక్కడ వుందని.
మావయ్య బతికి ఉన్నప్పుడే
చట్టం తన పని తాను చేసుకు పోలేందు
కుట్రలతో శాసించ వచ్చు అని
ఎదురు చెప్పి ఉండాల్సింది
రామ కోటి రాసుకోడానికి
భంగం కల్పించే నాటకంలో
బావ కళ్ళలో ఆనందం చూసినోడి పిల్లలు
తండ్రి లేని అనాధలు అయ్యే వారు కాదు
అలాంటి మామ ఇలాకాలోని సన్నివేశాలు
మాటి మాటి కి కుట్ర ల ను గుర్తుకు తెస్తున్నాయా?
చట్టం తన పని చేస్తుంటే
ప్రతి మలుపుకూ కుట్ర కుట్ర అని
ఇంటిల్ల పాదీ పాడుతుంటే
పార్టీ కూడా వంత పాడుతుంటే
బతికి లేని మావయ్య గారి
ఆత్మ భరించగలదా?
కోడలుగా మావయ్య ఆత్మను
అంతగా ఇబ్బంది పెడితే
ఆయన అభిమానుల గుండెలు ఆగితే
ఓదార్పుల నాటకాలు ఎవరు చేస్తారు?
అసలే ఓట్లకోసం ఇంటిల్ల పాదీ
పడరాని పాట్లు పడుతున్నారే!

www.chaakirevu.blogspot.com
No comments :

No comments :