April 28, 2013

టీడీపీ సభలో సైడ్‌లైట్స్

విశాఖపట్నం :బహిరంగ సభ జరిగిన ఏయూ గ్రౌండ్స్‌కు మధ్యాహ్నం రెండు గంటల నుంచే ప్రజల రాక ప్రారంభమైంది.
- చంద్రబాబు 208 రోజులపాటు చేసిన పాదయాత్రను పురస్కరించుకుని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి కేశినేని నాని 208 మీటర్ల పొడవు, 30 అడుగుల వెడల్పు వున్
- కృష్ణాజిల్లా కేసరపల్లి కళాకారులడప్పు వాయిద్యాలు కార్యకర్తలను ఉర్రూతలూగించాయి
-బందోబస్తులో భాగంగా పోలీసులు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధానవేదికపై 20 నిమిషాలపాటు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ఏయూ గ్రౌండ్స్‌లోకి 15 ప్రవేశద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రతిద్వారం వద్ద మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు.
- చంద్రబాబు కాన్వాయ్ గ్రౌండ్స్‌కు రావడానికి రెండు గంటల ముందే సభా ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. దీంతో వేలాది మంది రోడ్లపైనే ఉండిపోవాల్సివచ్చింది.
-వేదిక నుంచి సుమారు అర కిలోమీటరు దూరం వరకు మైకులు ఏర్పాటు చేశారు. దీంతో సభా ప్రాంగణంలోకి రాలేనివారంతా చంద్రబాబు ప్రసంగాన్ని మైకుల ద్వారా విన్నారు.
- కొందరు మహిళలు చిన్నపిల్లలతో సహా సభకు హాజరయ్యారు. వారికి ప్రత్యేకంగా కుర్చీలు వేశారు.
-మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వలంటీర్లకు మైకులో సూచనలు చేశారు.
-హైదరాబాద్ నుంచి వచ్చిన రాము అనే కార్యకర్త ఎన్టీఆర్ వేషంతో అలరించాడు.
- అరిసిమిల్లి రాధాకృష్ణ సారథ్యంలో సింగపూర్ నుంచి వచ్చిన టీడీపీ అభిమానులు సభాప్రాంగణంలో సందడి చేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
-స్థానిక టీడీపీ నాయకులు వాకీటాకీలు పట్టుకుని నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పలువురు వలంటీర్లు తమ నాయకుల ఫొటోలతో తయారుచేసిన టీ షర్టులను ధరించి సందడి చేశారు.
- చంద్రబాబు సభా ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేకంగా తయారు చేసిన బాణసంచాను కాల్చారు.
- చంద్రబాబు 2817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినందుకు హైదరాబాద్ లోని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎం.భానుప్రసాద్ 2817 దీపం బెలూన్లను గాలిలోకి విడిచిపెట్టారు.
- టీడీపీ నేత కింజరాపు ఎర్రన్నాయుడి మృతికి సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది.
న టీడీపీ పతాకాన్ని ర్యాలీగా ఏయూ గ్రౌండ్స్‌కు తీసుకువెళ్లారు. కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ వద్ద ప్రదర్శించారు.