April 21, 2013

చంద్రోత్సాహం

ఏలూరు

మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం.. ఎన్నో ఒడిదుడుకులు.. జయాలు, అపజయాలు.. దాడులు, ఎదురుదాడులు, అక్రమ కేసుల బనాయింపులు.. మరెన్నో చోట్ల పసుపు పచ్చని అభివృద్ధి గీటురాళ్లు.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నా, మరో తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తల మొక్కవోని దీక్ష.. మరెన్నో త్యాగాలు వెరసి పార్టీ అధినేత చంద్రబాబు ఈ మధ్యన చేసిన పాదయాత్ర తెలుగుదేశంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికార పగ్గాలు చేజిక్కించుకునే దిశగా కార్యకర్తలను, నాయకులను కార్యోన్ముఖులను చేసింది.

ఆర్థికపరమైన వెలితి ఉన్నా.. అనేక కష్టాలు ఎదురవుతున్నా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స మరోత్సాహం ఈ పార్టీలో స్పష్టంగా కన్పిస్తోంది.పార్టీలో సుదీర్ఘకాలం పా టు మరువలేని సేవలు అందించిన దిగ్గజాలు అమరులైన వారి స్థానంలో నవయువత నాయకత్వ పగ్గాలను చేపట్టారు.సై అంటే సై అనే ధైర్యాన్ని కూ డదీసుకుని అవినీతిపై సమరం చేస్తున్నారు. ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు. ఫలితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్ల క్రితం ఉన్న స్తబ్దత, నిస్తేజం, అసంతృప్తి, వ్యక్తిగత వైరాలు దూదిపందెల్లా ఎగిరిపోయా యి.

ఇప్పుడు అందరి సమిష్టి శప«థం ఒకటే.. అదీ తమ అధినేత చంద్రబాబును సీఎంను చేయాలని. పార్టీని అధికారంలోకి తేవాలని. చంద్రబాబు పదమూడు రోజుల పాటు జిల్లాలో చేసిన సుదీర్ఘ పాదయాత్ర సహజంగానే పార్టీకి కొంత కలిసొచ్చింది. దూరమైన కొన్ని వర్గాలు ఈ యాత్ర ద్వారా పార్టీకి చేరువయ్యాయి. ఈ విషయం స్పష్టంగా బయటపడింది. పార్టీలో ఎ న్ని సమస్యలున్నా అందరినీ ఏకతాటి మీదకు తేవడంలో ఓవైపు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, ఇంకోవైపు సీనియర్ నేత మాగంటిబాబు, మరోవైపు ఎమ్మెల్యేలు ప్రభాకర్, శివరామరాజు,శేషారావు,టి.వి.రామారా వు, కన్వీనర్లు అంబికా కృష్ణ, బడేటి బు జ్జి, గన్ని వీరాంజనేయులు, ముళ్లపూడి బాపిరాజు,జగ్గారెడ్డి, డాక్టర్ బాబ్జి, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, కర్రి రాధాకృష్ణారెడ్డి,వై.టి.రాజా, గాదిరాజు బాబు,మొడియం శ్రీనివాస్ వంటి ప్రముఖ నేతలు పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో మడమ తిప్పకుండా ముం దుకు సాగుతున్నారు. సీతారామలక్ష్మి నరసాపురం పార్లమెంటు నుంచి, మా గంటి బాబు ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దాదాపు సిద్ధమయ్యారు.ఇంకోవైపు మురళీమోహన్ రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీకి దిగబోతున్నారు.ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా కూడా పార్టీ భారీగానే పుంజుకుంది. కాంగ్రెస్,వైకాపాలకు కంట్లో నలుసు గా మారింది.

దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభాకర్ ఊరూవా డా పాదయాత్రలు కొనసాగిస్తున్నారు. తన నియోజకవర్గంలో ఆయనే సర్వం కార్యకర్తలకు అండగా నిలుస్తూ బాద్‌షాలా దూసుకుపోతున్నారు. తిరుగులేని ఆధిక్యతతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.నిడదవోలులో శేషారా వు దూకుడు కొనసాగుతూనే ఉంది. రైతులు,మిగతా అన్నివర్గాలకు ఆయన మరింత చేరువయ్యే ప్రయత్నంలో ఇప్పటికే కొంత సక్సెస్ సాధించారు.

ప్రజా సమస్యలపై నిరసనలు చేయ డం,సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించడం లో ఉండి ఎమ్మెల్యే శివరామరాజు గడిచిన కొన్నాళ్లుగా ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన ఏమి చేసినా శివ య జ్ఞం పేరిట కార్యకర్తల్లో కొత్త ఊపుకు దారితీస్తోంది. కొవ్వూరులో ఎమ్మెల్యే రామారావుదీ అదే తీరు. అక్కడ కొం దరు నేతలు పార్టీని వీడినప్పటికీ చం ద్రబాబు సాక్షిగా ఆయన అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలపై 'రామ' బాణాలు వదులుతున్నా రు. ఫలితంగా అక్కడ రామారావు దూకుడుతనం పార్టీ కార్యకర్తలను ఎ న్నికలకు సమాయత్తపరిచేలా ఉంది.

ఇక మాగంటి బాబు, సీతారామలక్ష్మిలు పార్టీకి రెండు కళ్లుగా మారారు. వీరిద్దరూ పార్టీని కొంత సమన్వయపరిచే విషయంలో పూర్తి విజయం సా ధించినట్లే కన్పిస్తోంది. చంద్రబాబు పాదయాత్ర నిర్వహణలో ఈ ఇద్దరు నేతలు చూపించిన చొరవ చంద్రబాబు ను సైతం సంతృప్తిపరిచింది. అలాగే భీమవరంలో గాదిరాజు బాబు, పాలకొల్లులో డాక్టర్ బాబ్జీ, నరసాపురంలో డాక్టర్ చినమిల్లి లాంటి నేతలు కూడా పార్టీ పరిరక్షణలో తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. గోపాలపురం, పోలవరం,చింతలపూడిలో డజన్లు కొద్దీ నేతలు ఆర్ధిక భారాన్ని కూడా భుజాన వేసుకుని పార్టీకి జవసత్వాలు అందిస్తున్నారు.

గోపాలపురంలో పారిశ్రామికవేత్త విక్రమాదిత్య పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.తణుకులో పార్టీని ఏదో రకంగా నిలబెట్టేందుకు వై.టి.రాజా నిర్విరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చిం తలపూడిలో జగ్గారెడ్డితో పాటు లింగపాలెం మండలానికి చెందిన పార్టీ ము ఖ్యులు ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు ఇప్పటికే లోతట్టు కార్యాచరణకు దిగారు.ఇంకోవైపు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఈ మధ్యన జరిగిన విద్యుత్ ఆందోళనలో నిర్విరామంగా ఊరూవాడా తిరిగారు. తద్వారా కార్యకర్తలకు కొత్త ధైర్యాన్ని ఇచ్చారు.రాబోయేది మన ప్రభుత్వమేనంటూ వారిలో ధీమాను రగిలించా రు.ఏలూరులో అంబికా కృష్ణ, బడేటి బుజ్జిల సమన్వయం పార్టీకి తిరుగులేని ధైర్యాన్నిచ్చింది. అలాగే అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో లోపాలు ఉన్నప్పటికీ కూడా అందరిదీ ఇప్పుడు ఒకటే మాటైంది. ఒకటే బాటైంది.

అదే తెలుగుదేశంలో కొత్త ఉత్తేజానికి దారితీస్తోంది. ఏలూరు జూట్‌మిల్లులో టిఎన్‌టియుసి గెలుపు అంబికా కృష్ణ శిబిరంలో అత్యధిక నూతనోత్సాహాన్ని సృ ష్టించింది. తాడేపల్లిగూడెం కన్వీనర్ ముళ్లపూడి బాపిరాజు, ఆయన అనుచరులు, మద్దతుదారులు పార్టీ కోసం నిర్విరామంగా కష్టాలను ఎదురొ
డ్డి, ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లటం ఆ నియోజకవర్గంలో పసుప పతాక ఎగురవేయాలన్న కాంక్ష కార్యకర్తల్లో రగిలించేలా చేసింది. సుదీర్ఘపాదయాత్ర ను ఈ నెల 27న చంద్రబాబు విశాఖపట్నం జిల్లాలో ముగించబోతున్నారు. దీనికి భారీగా తరలివెళ్లేందుకు శనివా రం పార్టీ జిల్లా కార్యాలయంలో విస్తృ త స్థాయి సమావేశం జరగబోతోంది. పార్టీ ముఖ్యులంతా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పార్టీ సమన్వయ కార్యకర్త పాలి ప్రసాద్ వీటిని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత కాగిత వెంకట్రావుతో పాటు ఒకరిద్దరు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు.