April 21, 2013

చంద్రబాబు రాక కోసం ఘనంగా ఏర్పాట్లు


( రంగారెడ్డి అర్బన్) టీడీపీ అధినేత చంద్రబాబు మీ కోసం పాదయాత్ర ముగించుకుని వస్తున్న సందర్భంగా ఈ నెల 28న శంషాబాద్‌లో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు జిల్లా టీడీపీ అధ్యక్షుడు టి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎర్రమంజిల్ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ కోసం యాత్రను ఈ నెల 27న విశాఖపట్నంలో ముగించుకుని, ఈ నెల 28న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్టు తెలిపారు. చంద్రబాబు రాక సందర్భంగా పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

ఏర్పాట్లపై సమీక్షా సమావేశం అంతకుముందుకు టీడీపీ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ శాసనసభపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. ఈ నెల 28న టీడీపీ అధినేత రాక సందర్భంగా నిర్వహించే ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, కె.ఎస్.రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ జిల్లా కమిటీ ఎంపిక ఉపాధ్యక్షులుగా జి. రాంచందర్‌గౌడ్, రొక్కం భీంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎం. శ్రీనివాస్‌గౌడ్, కె. చంద్రయ్య, డి. నారాయణరెడ్డి, రాజుగౌడ్, ఇ. వెంకటేశం, బి. శివలింగం, మీర్ మహ్మద్ అలీ, కె. లక్ష్మయ్య, జి మధుసూదన్‌రెడ్డి, జి. విఠల్‌రెడ్డి, సి. బల్వంత్‌రెడ్డి, ఎ. నర్సింగ్‌రావు, రాధాకృష్ణాయాదవ్, సి. అంజిరెడ్డి, ఎస్. కొండయ్య, ఎం. రాంరెడ్డి, జగదీష్‌యాదవ్, ఆర్. వెంకటేష్‌యాదవ్, జంగయ్యయాదవ్, రంగారావు, ఎస్సీ కృష్ణారెడ్డి, కె. మహేందర్‌రెడ్డి, రాజశేఖర్ ఎన్నికైనట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి వెల్లడించారు.

అదేవిధంగా పార్టీ అనుబంధ జిల్లా కమిటీల అధ్యక్షులుగా తెలుగు యువత అధ్యక్షుడు గణేష్‌గుప్తా, తెలుగునాడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా చిలుక మధుసూదన్‌రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడిగా కె.శంకర్‌గౌడ్, ఎస్సీ సెల్ బోడ బిక్షపతి, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రాజునాయక్, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిగా చింపుల సత్యనారాయణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఇ.వి. సాగర్, లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎస్. శ్రీనివాస్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడి
గా కొమ్ము ఉపేందర్ ఎన్నికైనట్లు వెల్లడించారు. జిల్లా కార్యవర్గంపై ఇంకా కసరత్తు జరుగుతోంది. నేడు పూర్తి వివరాలు వెలువరించినున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.