April 21, 2013

విశాఖ సభకు ప్రత్యేక రైలు

ఒంగోలు: విశాఖలో ఈనెల 27న జరగనున్న తెదేపా సభకు ఒంగోలు నుంచి కార్యకర్తలు తరలివెళ్ళేందుకు ఒక రైలును ఏర్పా టు చేయనున్నారు. ఆ మేరకు  ఇక్కడి జిల్లా పార్టీ కార్యాల యంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అక్టోబర్ 2న అనంతపురం జిల్లా నుంచి తెదేపా అధినేత చంద్రబాబు ప్రారంభించిన వస్తున్నా... మీ కోసం పాదయాత్ర ఈనెల 27న విశాఖలో ముగియనున్న విషయం విధితమే. ఆ సందర్భంగా భారీ సభకు తెదేపా శ్రే ణులు సమాయత్తం అవుతున్నాయి.

విశాఖకు పొరుగున ఉన్న జిల్లాల నుంచి భారీ సమీకరణ చేస్తుండగా కోస్తా ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలిరావాలని అధిష్ఠానం ఆదేశించింది. అందుకోసం జిల్లాలో ముఖ్యనేతలతో చర్చించేం దుకు రాష్ట్ర పార్టీ తరుపున బాధ్యులను నియమించారు. జిల్లా బాధ్యుడైన మాజీ ఎంపీ లాల్‌జాన్ బాషా గురు వారం ఒంగోలు వచ్చారు.

ఇక్కడి పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జనార్దన్ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు శిద్దా రాఘవరావు, మాజీ ఎంపీ చిమటా సాంబు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ఏలూరి సాంబశివరావు, డీబీవీ స్వామి ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. సమావే శానికి హాజరు కాలేకపోయిన ఇతర ముఖ్యనేతలతో కూడా వారు సంప్ర దించినట్టు సమాచారం. చివరకు ఒ ంగోలు నుంచి ఒక రైలును ఏర్పాటు చేసి కార్యకర్తలను తరలించాలని, ఇ తర ప్రాంతాల నుంచి వివిధ మార్గాల ద్వారా ముఖ్య కార్యకర్తలంతా వెళ్ళేలా చూడాలని సమావేశంలో నిర్ణయిం చారు.

ఇదిలా ఉండగా జన సమీకరణకు సంబంధించి గుంటూరు జిల్లాకు పర్య వేక్షకునిగా మన జిల్లాకు చెందిన పొలి ట్‌బ్యూరో సభ్యుడు శిద్దా రాఘవరా వును అధిష్ఠానం నియమించింది. శని వారం ఆయన గుంటూరు జిల్లా నేతలతో సమావేశం నిర్వహించను న్నట్టు సమాచారం.