April 21, 2013

బాబు సభకు భారీ జన సమీకరణ

విజయనగరం టౌన్: విశాఖలో ఈ నెల 27న జరగనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ జరిపేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా పార్టీ ముఖ్యనేతలు పలుమార్లు సమావేశమై యాత్ర ముగింపు సభను విజయవంతం చేయడంలో వ్యూహరచన చేస్తున్నారు.పార్టీ పొలిట్ బ్యూరో సభ్యు డు పూసపాటి అశోక్ గజపతిరాజు నేతృత్వంలో ఈ ఏర్పాట్లు ఆరంభమయ్యాయి. జిల్లా నుంచి గరిష్టంగా లక్ష మంది వేళ్లేలా ప్రణాళిక రూపొందించిన నాయకులు ఇందులో నియోజకవర్గానికి పది వేల మంతున 90 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను కదలించేందుకు వ్యూహరచన ప్రారంభించారు.

తొమ్మిది నియోజకవర్గాలతో పా టు జిల్లా కేంద్రం విజయనగరం నుంచి అదనంగా పది వేల మందిని తరలించాలని యోచిస్తున్నారు. జన సమీకరణకు అవసరమయ్యే వాహనాలను కూ డా ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు పాదయాత్ర ఈ జిల్లాలో కూడా వుంటుందని పార్టీ శ్రేణులు ఆశించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవం తం అయినందున ఈ జిల్లాలో కూడా జయప్రదం చేయాలని కార్యకర్తలు, నాయకులు ఉత్సాహపడ్డారు. అయితే అనుకోని కారణాల వల్ల విశాఖతోనే పా దయాత్ర ముగిసిన నేపథ్యంలో ఆ సభ కు పెద్ద ఎత్తున తరలివెల్లాలని వారం తా భావిస్తున్నారు.

విశాఖపట్టణం విజయవంతం చేయాలని నాయకులు ధృ డసంకల్పంతో వుండడానికి రెండు కారణాలు వున్నాయి. ఇప్పటికే జిల్లా కేం ద్రం నుంచి నియోజకవర్గ, మండల స్థాయి నేతలకు జన సమీకరణకు సం బంధించి ఆదేశాలు జారీ అయ్యాయి. అక్కడ నుంచి క్షేత్రస్థాయిలో నేతలు శ్రేణులను కలుస్తున్నారు. ముగింపు సభ విజయవంతం చేయాల్సిన అవసరాన్ని కార్యకర్తలకు వివరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాబు సభను విజయవంతం చేయడం ద్వారా స్థానికంగా పార్టీ పట్టును కూడా నిరూపించుకోవడానికి దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కు వ సంఖ్యలో తరలివెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తగిన సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేయాలని నేతలపై ఒత్తిడి ప్రారంభించారు. ఇప్పటి వరకూ అందించిన సమాచారం ప్రకారం ని యోజకవర్గానికి పది బస్సులు ఏర్పా టు చేయడానికి జిల్లా పార్టీ పెద్దలు నిర్ణయించారు. అలాగే జిల్లా మొత్తం 1100 నాలుగు చక్రాల వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.

వీటితో పాటు నాయకుల సొంత వాహనాలు, ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం ఈ జిల్లా నుంచి సుమారు 1500 వాహనాలతో తరలివెళ్లేందుకు సంసిద్ధమౌతున్నారు. 27న సభ జరగనున్నందున సమయం కూడా ఎక్కువగా లేకపోవడం వలన పార్టీ నేతలు జనసమీకరణ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.