November 1, 2012

ఎర్రన్నాయుడు ఇక మనకు లేరు...

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి కింజరపు ఎర్రన్నాయుడు (55) శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. విశాఖలోని శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా శ్రీకాకుశం జిల్లా రణస్థలం వద్ద తాను ప్రయాణిస్తున్నటువంటి ఇన్నోవా కారు ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ ను డీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాగా తీవ్రంగా గాయపడిన ఎర్రన్నాయుడుని శ్రీకాకుళం రిమ్స్ సాయి శేషాధ్రి ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతలో ఆసుపత్రిలో మృతిచెందారు. ఈయనతో పాటు శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షుడి బాబ్జీ చౌదరితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


కేంద్ర గ్రామీణ శాఖ మంత్రిగా కేబినేట్ లో హోదాలో పనిచేసినటువంటి ఎర్రన్నాయుడు గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపిగా గెలుపొందారు. బిసి వర్గానికి చెందిన ఎర్రన్నాయుడు గతంలో దేశంలో కీలక రాజకీయాను నడిపారు. తెలుగుదేశం పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో ఎర్రన్నాయుడు కీలకంగా పాల్గొనేవారు. అదే విధంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఎర్రన్నాయుడు హరిశ్చంద్రపురం నుండి 1983లో మొట్టమొదటి సారిగా గెలుపొందారు. అనంతరం వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపిగా 2009వరకు ఎన్నికయ్యరు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరి నేతగా కూడా పనిచేశారు. 1957, ఫిబ్రవరి 23న కోట బొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామంలో జన్మించారు. దాలి నాయుడు, కళావతమ్మల మొదటి సంతానమైనటువంటి ఎర్రన్నాయుడు 1996నుండి 1998వరకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ఆంధ్రప్రదేశ్ కు నిధులను మంజూరీ చేయడంలో ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను పూర్తి చేసినటువంటి ఎర్రన్నాయుడు విద్యార్థి దశలోనే రాజకీయాలను అలవర్చుకున్నారు. ఎర్రన్నాయుడు మరణ వార్త విన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు.
No comments :

No comments :