May 20, 2013

అవినీతి ప్రజాస్వామ్యానికే ముప్పు : చంద్రబాబు



న్యూఢిల్లీ : అవినీతి ప్రజాస్వామ్యానికే ముప్పు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్‌తో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. క ళంకిత మంత్రులపై చర్యలు తీసుకుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు బాబు తెలిపారు. లక్ష కోట్లు అవినీతి జరిగిందని రాష్ట్రపతికి వివరించామని, అవినీతి మంత్రులపై రాష్ట్రపతికి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. క్విడ్‌ప్రోకో ద్వారా అవినితికి పాల్పడ్డారని బాబు ఆరోపించారు. అవినీతిపై పలు రూపాల్లో పోరాడుతున్నామన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఈడీ విఫలమైందని విమర్శించారు. వైఎస్ ప్రవేశ పెట్టిన నీటి ప్రాజెక్టులన్నింటిలోనూ అవినీతి జరిగిందన్నారు. అవినీతి సొమ్ముతో ఛానెల్, పేపర్ పెట్టి జగన్ పార్టీ అందర్నీ బ్లాక్ మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. మైనింగ్ మాఫియాపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గనులు, ఖనిజసంపద, ఎస్ఈజెడ్ పేరుతో భూములను అన్యక్రాంతం చేశారని బాబు పేర్కొన్నారు. వైఎస్ చేసిన అవినీతికి ప్రధాని మన్మోహన్ సింగ్ వత్తాసుపలికారని ఆరోపించారు. అవినీతిపై చట్టసభల్లో పోరాటం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.