May 20, 2013

తెలుగుదేశం 'పంచరత్నాలు' ఇవే !

జగిత్యాల: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఆయన తనయుడు లోకేష్ నడుంబిగించారు. తెలుగు దేశం పార్టీ ఇచ్చిన 5 ముఖ్యమయిన హామీలకు పంచరత్నాలుగా నామకరణం చేసారు. సోమవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన మినీమహానాడులో పాల్గొన్న లోకేష్ తనదైన శైలిలో ప్రసంగించారు. అందరి దృష్టిని ఆకర్షించారు. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి మానిఫెస్టోను విడుదల చేసారు. దానికి పంచరత్నాలు అని నామకరణం చేసారు. ఇందులో మొదటగా రైతులకు రుణాల మాఫీ, రెండు మద్యం బెల్టు షాపుల ఎత్తివేత, మూడు తాగునీటి సమస్య పరిష్కారం, నాలుగు బీసీలకు వంద సీట్లు, ఐదు నిరుద్యోగులకు నెలనెలా నగదు.. ల్యాప్ టాప్ ల అందజేతగా ఇందులో పేర్కొన్నారు.

ఇప్పటివరకు తండ్రి చేసిన పాదయాత్ర ఔన్నత్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసేకేల్లె ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు సూచించారు. మొత్తానికి చినబాబు వచ్చే ఎన్నికల కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు.