May 20, 2013

కళంకితులను సాగనంపండి!


అవినీతి మంత్రులపై రాష్టప్రతికి బాబు విజ్ఞప్తి
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రణబ్‌ బద్దకు
అవినీతిని కిరణ్‌ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ
వైఎస్‌ అవినీతిపై ఆదినుంచి పోరాడుతున్నామని ప్రకటన

న్యూఢిల్లీ : కళంకిత మంత్రుల వ్యవహా రంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బృందం సోమవారం నాడు రాష్టప్రతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించా లని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కళంకిత మంత్రు లను తక్షణమే తొలగించాలని రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీని కోరినట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి రాష్టప్రతి భవన్లో రాష్టప్రతితో సమావేశమైన అనంతరం ఢిల్లీలోని మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఫెమా ఉల్లంఘన కేసులో కోర్టు తప్పు బట్టినా మంత్రి పార్థసారథి పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. అవినీతిపై పోరాడాల్సిన వ్యక్తే అవినీతిని ప్రొత్సహిస్తున్నారని సీఎం కిరణ్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్ర సరిహద్దులు మార్చేసినా ప్రభుత్వం పట్టించుకునేలా లేదని మండిపడ్డారు.

వైఎస్‌ హయాంలో విచ్చలవిడి అవినీతి జరిగిందని, చంద్రబాబు నాయుడు ఆరోపిం చారు. జలయజ్ఞం పేరుతో వైఎస్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మరమ్తత్తుల్లో అవినీతి పేరుకుపో యిందన్నారు. నీకది- నాకది ( క్విడ్‌ ప్రో క్రో) పద్దతిలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. పలు ఛార్జీషీట్ల ద్వారా 43 వేల కోట్లు దుర్వియ్గోగం అయ్యాయని, సీబీఐ నిర్ధారించిందని చంద్రబాబు రాష్టప్రతి దృస్టికి తీసు కువెళ్లారన్నారు. మైనింగ్‌ మాఫియా, రాజా ఆఫ్‌ కరెప్షన్‌ పుస్తకాలను రాష్టప్రతికి అందజేశామని చంద్ర బాబు నాయుడు అన్నారు. మైనింగ్‌ మాఫియా ప్రజా స్వామ్యానికి హానిపై వేసిన ఈ పుస్తకాలను పార్లమెం టులో అందరికీ అందజేశామన్నారు.

వైఎస్‌, ఆయన కుంటుంబ అవినీతిపై ఆధారాలతో సహా ఆ పుస్తకంలో రాశామన్నారు. అయితే అవినీతి డబ్బులతో కొందరు పత్రిక, టీవీ ఛానల్‌ పెట్టుకుని తమ పార్టీపైనా, తన పైనా వ్యక్తిగతంగా ఆ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇలా అన్ని విషయాలపైనా బ్లాక్‌ మేయిల్‌ చేయడానికి కూడా ఆ పత్రిక, ఛానల్‌ వెనుకాడడం లేదని మండిపడ్డారు. వైఎస్‌, జగన్‌ అక్రమాస్తులపై అన్ని రాజ్యాంగా బద్ద సంస్థల ముందు పోరాటం చేశామని చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అన్నారు.