January 6, 2013

జనంతో మమేకమై.. భవిష్యత్తుకు ఆశా కిరణమై..

 
తిమ్మాపూర్ నుంచి మొదలైన బాబు యాత్రకు జనం నీరాజనాలు పట్టా రు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. పిల్లలు, వృద్ధులు దారిపొడవునా గం టల తరబడి ఎదురుచూస్తూ నిలుచున్నారు. తనను కలవడానికి వచ్చిన గ్రామీణులను బా బు చిరునవ్వుతో పలకరించారు. సమస్యలను ఆలకించారు. పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు మా ర్గం మధ్యలో పొలాల్లోకి వెళ్ళి అక్కడ పని చేస్తు న్న వ్యవసాయకూలీలు, మహిళలతో మాట్లాడా రు. పంటల పరిస్థితిని తెలుసుకున్నారు. ఆర్ధిక స్థితిగతులపై ఆరా తీశారు. బాబుకు తమ ఇ బ్బందులను చెప్పుకునేందుకు మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని బాబు పలకరించగానే త మ సమస్యలను ఏకరువు పెట్టారు. అనేక మం ది వినతి పత్రాలను అందచేశారు. పాదయాత్ర సాగిన రోడ్డుపై కార్యకర్తలు పూలు చల్లారు. బో నాలు, బతుకమ్మలతో ఎదురేగారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులు కూడా చంద్రబాబును కలిశారు. కులవృత్తులను కాపాడాలని అభ్యర్థించారు. వారితో బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కులవృత్తులు దెబ్బతిన్న తీరును వివరిస్తూ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి వృత్తుల రక్షణకు బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

తిమ్మాపూర్‌లో బస్సు నుంచి బాబు బయట కు రాగానే మహిళలు మంగళహారతులు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. వ్యవసాయ కూ లీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రజిత అనే వికలాంగురాలిని ప్రత్యేకంగా పలకరించా రు. పింఛన్ వస్తోందా అని ఆరా తీశారు. తి మ్మాపూర్ గ్రామశివార్లలో ఎండిపోయిన ఎస్సారెస్పీ కాలువలను పరిశీలించారు. వాటి దుస్థితి ని చూసి విచారం వ్యక్తం చేశారు. బాబ్లీతో పాటు 14 ప్రాజెక్టులు నిర్మించడం వల్ల గోదావరి జలా ల రాక నిలిచిపోయిందన్నారు.ఎస్సారెస్పీ కాలువల్లో ప్రస్తుతం నీళ్ళకు బదులు రైతుల కన్నీళ్ళు పారుతున్నాయని ఆవేదనగా అన్నారు.

మహిళతో మాటా మంతీ

తిమ్మాపూర్ దాటిన తర్వాత కొత్తగూడెం పరిసర ప్రాంతాలకు వచ్చిన తర్వాత అక్కడ కొద్ది సేపు సేద తీరారు. అప్పటికే అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న కొత్తగూడెం గ్రామానికి చెంది న మాజీ సర్పంచ్ భార్య విజయమ్మతో పాటు ప లువురు మహిళలు గ్రామాల్లో కరెంట్ లేకపోవ డం వల్ల పడుతున్న ఇబ్బందులను వివరించా రు. గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నామని, పా వలా వడ్డీ రుణాలు అందడం లేదని ఫిర్యాదు చేశారు.

వ్యవసాయ కూలీలతో..

తీగరాజుపల్లి శివార్లలో పొలాల్లోకి చంద్రబా బు వెళ్ళి అక్కడ నాట్లు వేస్తున్న వ్యవసాయ కూ లీలను పలకరించారు. సాగు పరిస్థితులపై ఆరా తీసారు. కరెంట్ సరఫరా లేక పంటలు పండక ఆర్థిక ఇబ్బందును ఎదుర్కొంటున్నామని, అప్పులు కట్టలేకపోతున్నామని కూలీలు వాపోయారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారికి అండగా ఉంటా, పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తాన ని, వ్యవసాయ పెట్టుబడులు సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పేదవారి కష్టాలు తీర్చేందుకే ఈ యాత్ర చేపట్టానన్నారు.

ఘనస్వాగతం

తీగరాజుపల్లికి చేరుకున్న బాబుకు ఘనస్వాగతం లభించింది. మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. డప్పు చప్పుళ్ళు, మంగళహారతులతో నీరాజనాలు పలికారు. దారి పొడవునా బాబుకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఎన్‌టీఆర్ విగ్రహానికి టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు పూల మాల వేశారు. తీగరాజుపల్లి దాటి వర్ధన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా ఆ నియోజకవర్గ ఇన్‌చార్జీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం ఘన స్వాగతం పలికా రు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని మండలాల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తు న తరలి వచ్చారు.