January 6, 2013

టీడీపీ తోనే పేదలకు మేలు




టీడీపీ అధికారంలో ఉ న్న సమయంలోనే పేదలకు మేలు జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అ న్నారు.  ఈసందర్భంగా చౌటపల్లి క్రాస్ వద్ద ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మా ట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రె స్, వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు ప్రజల సమస్యలు పట్టించుకునే సోయి లో లేరన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని నిప్పులు చెరిగారు. టీడీపీ అధికారంలోకి వస్తేరైతుల రుణమాఫీ పై తొలిసంతకం చేస్తాని స్పష్టం చేశా రు. బెల్టుషాపులను నివారించేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. పేదలు గృహాలు నిర్మించుకునేందుకు రూ. ల క్ష కేటాయిస్తామని హామీ ఇచ్చారు. లం బాడీల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక అమలు చేస్తామన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు, గిరిజనుల పిల్ల ల వివాహం కోసం రూ. 50వేలు, భూ మి లేని గిరిజనులకు రెండు ఎకరాల భూమి అందించనున్నట్లు వివరించా రు. ఉత్తర తెలంగాణకు నష్టం చేకూర్చే బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకుని పోరాటాలు కొనసాగిచింది టీ డీపీయేని గుర్తు చేశా రు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మించడంతో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరి గే పరిస్థితి ఉందన్నారు. బాబ్లీ పోరాటంలో మూడు రోజుల పాటు పోలీసు ల కస్టడిలో ఉన్నట్లు పేర్కొన్నారు. తా ను తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తా

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రైతుల పంట రుణా ల మాఫీ చేసేందుకు తొలి సంతకం చే స్తానని చంద్రబాబునాయుడు అన్నా రు. శుక్రవారం రాత్రి తురుకల సోమా రం వద్ద ఆయన మాట్లాడారు. 2004 లో మిగులు కరెంట్ ఉండేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్ సరఫరా చేయకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లో విద్యుత్ సర్‌చార్జీల పేరుతో 10వేల కోట్ల రూపాయల ను ప్రజలపై బారం మోపేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ఎరువుల ధరలతో పాటుగా గిట్టుబాటు ధరను అందించి ఆదుకుంటామని హామి ఇచ్చారు. ప్రతి గ్రామానికి, తండాకు ఎన్‌టీఆర్ సుజల పేరుతో గోదావరి నీటిని అందిస్తానని అన్నారు. యువత కు ఉపాధితో పాటు, ఉద్యోగాలను ఇ స్తూ తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండేలా కుటుంబపోషణకు సహకరించేలా కృషిచేస్తానని వివరించారు.

ఈ కార్యక్రమంలో టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి, ప్రధాన కార్యద ర్శి ఈగ మల్లేశం, రాజ్య సభ సభ్యురా లు గుండు సుధారాణి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ బి. వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ మాజీ ఎమ్మె ల్యే వేం నరెందర్‌రెడ్డి, బయ్యస్వామి, మేడిశెట్టి రాములు, మనోజ్‌గౌడ్, రవీందర్, బాలకిషన్, మధన్‌మోహన్, నవీ న్, సురేందర్‌రావు, బొక్కల బాబు, కు మారస్వామి, విక్రమ్ పాల్గొన్నారు.