April 11, 2013

విజయం మనదే!


కాకినాడ:యువత తలచుకుంటే కొండల్నయినా పిండి చేయగలరని, రాజకీయాలలో ఉన్న కాలుష్యాన్ని పారద్రోలి పరిశుద్దం చేయాలంటే యువత రాజకీయాలలోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తుని గొల్ల అప్పారా వు సెంటర్‌లో మంగళవారం రాత్రి జరిగిన వస్తున్నా మీకోసం పాదయాత్ర సభలో చంద్రబాబు యువతను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు.

తమ్ముళ్లూ మీరు తలచుకుంటే దేన్నయినా సాధించగలరు? స్వాతంత్య్రం కో సం బ్రిటీష్ వాళ్లతో పోరాడిన మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, రా జ్యాంగ నిర్మాత అంబేద్కర్, పేదల కోసం పాటుపడిన ఫూలే, తెలుగు వా రి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్‌లను యువత ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

టీడీపీ హయాంలో లంచాల బెడదలేదు: యువత

టీడీపీ పాలనలో ఉద్యోగాల్లోనూ, ఇతర పథకాలలోనూ లంచాల బెడదలేదని పలువురు యువకులు చంద్రబా బు దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్ల మం జూరులోనూ కాంగ్రెస్ వాళ్లు లంచాలు తింటున్నారని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. యనమల రామకృష్ణుడు హయాంలో లంచాలులేకుండా తునిలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని పలువురు యువకులు చంద్రబాబుకు చెప్పారు.

టీడీపీ పాలనలో ఉద్యోగులు సక్రమంగా పనిచేసేవారని, ఇపుడు అసలు ఆఫీసులకే రావడంలేదని, వస్తే డబ్బు ఇస్తేనే పనులు చేస్తున్నారని పలువురు యువకులు పేర్కొన్నారు.

తుని శాటిలైట్ సిటీ అభివృద్ధి

విశాఖపట్నానికి తునిని శాటిలైట్ సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తుని పరిసరప్రాంతాలలో పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికం గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషిచేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

తునిలో స్టేడియం,ట్రామాకేర్ సెంటర్


టీడీపీ అధికారంలోకి వచ్చాకా తునిలో మినీ స్టేడియం, ఆసుపత్రిలో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటుచేస్తామని చంద్రబబు హామీ ఇచ్చారు. యనమల వంటి నిజాయితీపరులైన నాయకులకు అండగా ఉండాలని చంద్రబాబు చెప్పారు.

తుని: వస్తున్నా.. మీకోసం అంటూ చంద్రబాబు ప్రజల వద్దకెళుతూ ఆకట్టుకుంటుండగా నిత్యం వేలాది అభిమానులు, జనం మధ్యకెళ్తున్న బాబు రక్షణ కోసం ప్రాణాలకు తెగించి మరీ పాటు పడుతున్న చంద్రబాబు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పసుపు బనియన్లు ధరించి వాలంటీర్ల రూపంలో ప్రభుత్వ రక్షణ సిబ్బందితోపాటు ముందుండి నడుస్తున్న దండు బాబు రక్షణకోసం పెద్ద పోరాటమే చేస్తోంది.

ఓ పక్క ముందుకొచ్చిపడే జనసం దోహాన్ని అదుపుచేయడం మాటలు కాదు. 2004లో ప్రారంభమైన చంద్రదండు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో మరింత విస్తరిస్తూ ముం దుకెళుతోంది. ప్రస్తుతం 16 జిల్లాల్లో 2,270మంది సభ్యులతో చంద్రబాబు ఆశయసాధన కోసం చంద్ర దండు పనిచేస్తోంది. అంతా బడుగు, బలహీన, పేద, మధ్య తరగతి యువకులతో నిండివున్న దండు బాబు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంతోపాటు ప్రస్తుతం 'వస్తున్నా మీ కోసం' యాత్రలో క్రమ శిక్షణగల సైనికుల మాదిరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా స్వయంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

ఈ దిశగా వారు కొన్నిసార్లు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. ఇద్దరు యువకులు కాళ్లు విరిగి ఆసు పత్రిపాలవగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడు మెడ పై పెద్ద గాయంతో బాధపడుతూ చంద్రబాబు వెంటే రక్షణగా ఉంటున్నారు. గన్‌మెన్ల దెబ్బలు, జనం తోపు లాటల్లో నలిగిపోతున్న దండు ఎటువంటి ప్రమాదాలు తలెత్తినా వెరవకుండా ముందుకు సాగుతామంటు న్నారు. యాత్ర ప్రారంభమై 6 నెలలు దాటుతున్నా కనీసం భార్యాపిల్లల వద్ద క్కూడా వెళ్ళకుండా యాత్ర సమన్వయకర్త గరికిపాటి మోహనరావు ఆదేశాలకు అనుగుణంగా సాగుతుండడం విశే షం.