April 11, 2013

22 రోజులు... 222 కిలోమీటర్లు

తుని: కాంగ్రెస్‌పాలనలో రాష్ట్రం చీకటాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని 'దే శం' అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఆయన కొలిమేరు, గాంధీనగరం, ఎన్.సూరవ రం గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆ యా గ్రామాల్లో ప్రజలనుద్దేవించి ప్ర సంగించారు. ఏటిపట్టు గ్రామాలైనందున పుష్కలంగా భూగర్భ జలాలు న్నా వాటిని తోడుకుని పంటలు సాగుచేసుకునేందుకు కరెంటులేకుండా పో తోందని విమర్శించారు. కనీసం తాగునీటికి ఇబ్బందులు పడుతుండడం దా రుణమన్నారు.

ఎక్కడికక్కడ ఇసుక మాఫియా చెలరేగి తాండవనదిని తవ్విపారేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల నదికి ముప్పు ఏర్పడుతుందన్నారు. చెరకుపంటను విస్తారంగా సాగుచేస్తున్నారని టన్నుకు ఉత్పాదక వ్యయం రూ.2,500 ఖర్చవుతుంటే ప్రభుత్వం రూ.1750ఇస్తుండడం దారుణమన్నారు. గిట్టుబాటుగాని వ్యవసాయంతో రైతులు నష్టాలపాలవుతున్నారన్నారు. రైతు సంపాదనతో తిండి కరవవుతున్నందున పిల్లలను చదివించడం కూడా కష్టమవుతున్నదన్నారు. ఆడవారి మంగళసూత్రా లు కూడా తాకట్టులో ఉండి ఇబ్బందులు పడ్తున్నారన్నారు.

అందరి రుణాలూ మాఫీ చేసి ఆడపడుచుల బంగారం విడిపిస్తానన్నారు. రూ.600వృద్ధులు, వితం తు పెన్షన్లను పెంచుతామన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించి ఉచిత ఇళ్ళతో కాలనీలు నిర్మించి ఇస్తామన్నారు. నకిలీ బ దిలీ పథకంతో కాంగ్రెస్‌వాళ్ళ పొట్టలే నింపుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రజలకు కడుపునిండేలా ఉంటేనే నిజమైన నగదు బదిలీ పథకం అవుతుందన్నా రు. తుని అసెంబ్లీ అభ్యర్థి యనమల కృష్ణు డు, కాకినాడ పార్లమెంటు స్థానం ఇన్‌చార్జి పోతుల విశ్వం ఆయనకు స్థానిక సమస్యలను వివరించారు.

ఆంధ్రజ్యోతి - కాకినాడ:'వ్యవసాయం చేసి అప్పుల్లో కూరుకుపోతున్నాం.. బయట మార్కెట్లో కి లో ఇరవై, ముప్పయ్‌కి అమ్మే కూరగాయలు మా దగ్గర సగానికి కూడా కొనడంలేదు. ఏదైనా వుంది. వ్యవసాయం చేయడం చాలా కష్టంగా వుంది. మానేద్దామంటే వేరే పనిచేతకాదు. ఏం చేయమంటారు?'' అని పలువురు రైతులు చంద్రబాబును ప్రశ్నించారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర బుధవారం సాయంత్రం 5 గంటలకు తుని మండలం కుమ్మరిలోవ నుంచి ప్రారంభమైంది. కొలిమేరు వెళ్లేదారిలో మిర ప, వంగ తోటల్లోకి వెళ్లి చంద్రబాబు రైతుల సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఒక రైతుతో చంద్రబాబు వ్యవసాయ పెట్టుబడుల గురిం చి, ధరల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకా రైతులు, కౌలు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రైతులు ఆనందంగా జీవితాలను సాగించేలా టీడీపీ కృషి చేస్తుందన్నారు. వ్యవసాయం చేసే రైతుల్లో ఎవరైనా బాగుపడ్డారా? అని చంద్రబాబు అక్కడి రైతులతో అన్నా రు. గీత కార్మికులతోనూ చంద్రబాబు ముచ్చటించారు. బెల్టుషాపుల వల్ల ఉపాధి కోల్పోతున్నామని గీతకార్మికులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

ఖిీడీపీ వచ్చాకా బెల్టుషాపులు రద్దు చేయిస్తామన్నారు. కరెంటు ఎపు డు వస్తుందోనని రైతులు పొలం లో కాపలా కాయాల్సి వస్తున్నదని చంద్రబాబు అన్నారు. ఈసందర్భంగా కొలిమేరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. తుని ప్రాంతంలో తాం డవ వున్నా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

రాష్ట్రంలో 189 రోజులు 2,677 కిలోమీటర్ల మేర చంద్రబాబు యాత్రసాగింది. జిల్లాలో 22వ రోజు పాదయాత్ర తుని మండలం కుమ్మరిలోవ, కొలిమేరు, ఎన్ సూరవరంలలో సాగిం ది. బుధవారం నాటికి జిల్లాలో చంద్రబాబు 222 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.

మార్గమధ్యలో చంద్రబాబును కలిసిన ప్రజలు తాగునీరు, విద్యుత్, గుంతలుపడిన రోడ్లు, దోమలబెడద, ఆసుపత్రుల్లో మందుల కొరత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల తదితర సమస్యలపై విన్నవించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మా ట్లాడుతూ.. కాంగ్రెస్ దొంగల పాలనలో పేదల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన సొమ్మును వాళ్లే తినేశారన్నారు. వైఎస్ ప్రపంచంలో ఎక్కడాలేని స్థాయి లో అక్రమాలకు ఒడిగట్టి కొడుక్కి లక్ష కోట్లు దోచిపెట్టారని విమర్శించారు.

ఉపాధి సొమ్మూ తినేశారు

కాంగ్రెస్ దొంగలు ఉపాధిహామీ, ఇళ్లలోనూ దొంగబిల్లులతో సొమ్ము కాజేశారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలే తప్పఇపుడు కాంగ్రెస్ దొంగ
లు ప్రజలకు చేసిందేమీలేదన్నారు.

రెండు కొండల మధ్య సూరవరం చూస్తే మా ఊరు గుర్తొస్తుంది..

సూరవరంలో భూములు, కొండ లు, తోటలు అన్నీ ఎంతో ఆహ్లాదంగా వున్నాయి. గ్రామాన్ని చూస్తే మా ఊ రు గుర్తొస్తున్నదని చంద్రబాబు అన్నా రు. వస్తున్నా మీ కోసం యాత్ర లో ఆ గ్రామస్థులతో మాట్లాడారు. చిన్నపుడు నారావారిపల్లెలో వున్నపుడు రెండు కొండలమధ్య ఎంతో ఆహ్లాదంగా వుండేదన్నారు. ఇపుడు సూరవరం కూడా అన్పిస్తున్నదన్నారు.