April 11, 2013

భ్రష్టుపట్టిపోతున్న గవర్నర్ వ్యవస్థ

రాజమండ్రి సిటీ: రాష్ట్ర ప్రభుత్వం లో అవినీతి మంత్రులు జగన్ కేసులో నిందితులుగా ఉన్న వారిని తొలగించ కపోవడం భ్రష్టుపట్టిపోతున్న గవర్నర్ వ్యవస్థకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బు చ్చయ చౌదరి విమర్శించారు. రాజమండ్రిలో బుధవారం తన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడు తూ జగన్ దోపిడీ వెనుక కాంగ్రెస్ పెద్ద ల హస్తం ఉందన్నారు. ముఖ్యమంత్రి అవినీతిపరులను రక్షించే పనిలో ఉన్నారని ఇందులో భాగంగానే ఆ ఆరుగురు అవినీతి మంత్రులపై ఇంతవరకు చర్య లు తీసుకోలేదన్నారు.

జగన్ అక్రమాలలో భాగస్వాములుగా ఉన్న మంత్రు లు రాజీనామ చేస్తున్న వాటిని ఆమోదించడంలో గవర్నర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన విమర్శించారు. విధి నిర్వహణలో గవర్నర్ విఫలమవుతున్నారని ఆరోపించారు. సెక్షన్ 420 లో నిందితులుగా వున్న వారు హోం మంత్రిగా ఉండడానికి అనర్హులని, ఈ కేసులో ఉన్న ఆరుగురు మంత్రులను మంత్రివర్గంలో పెట్టుకుని సీఎం వారికి సహకరించడాన్ని బట్టే కాంగ్రెస్ ప్ర భుత్వం అవినీతికి ఏ స్థాయిలో కొమ్ముకాస్తుందో అర్థమవుతుందన్నారు. వెం టనే అవినీతి మంత్రులను పదవులు నుంచి తొలగించాలని డిమాండ్ చేశా రు. వైఎస్సార్ హాయాంలో ఆయనకు ముఖ్య సలహాదారుడిగా ఉండి నడిపించిన కేవీపీని కాంగ్రెస్ హై కమాండ్ కాపాడుకుంటోందన్నారు.

బొగ్గు కొనుగోలులో ముఖ్యమంత్రి భారీగా అవినీతికి పాల్పడ్డారని, అందువల్లే రాష్ట్ర అంధకారమైందన్నారు. గుంటూరు సరస్వతి పవర్ కంపెనీకి 1532 ఎకరాల భూమిని కేటాయించారని, అయి తే ప్రస్తుతం ఆ ఫైల్ గల్లంతైందని ఇటువంటి మంత్రులు ఉంటే ఇలాగే జరుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు.

దోపిడీదారుల పార్టీకి ఎన్టీఆర్ ఫొటో పెట్టుకునే అర్హత లేదు:లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనా న్ని దోపిడీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆరాధ్యదైవం దివంగత ఎన్టీఆర్ ఫొటోను పెట్టుకొనే అర్హత లేద ని గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. వైఎస్ఆర్ ఫొటో పక్కన ఎన్టీఆర్ ఫొటో పెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యాలయాల్లోను, అభిమానుల ఇళ్లల్లోను ఎన్టీఆర్ ఫొటో పె ట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండద ని అయితే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లక్షల కోట్లు అక్రమార్జన చేసిన వైఎస్సార్ ఫొటో పక్కన ఎన్టీఆర్ ఫొటోను ఎలా పెడతారని ప్రశ్నించారు.

ఈ ఫొటో విషయంలో హరికృష్ణ వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. సమర్థించేవారికి మతిలేదన్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీ పురందేశ్వరి విషయానికి వస్తే కూతురుగా ఆమె ఎన్టీఆర్ ఫొటోను పె ట్టుకోవచ్చన్నారు. సమావేశంలో వి. రాంబాబు, రెడ్డి మణి, వర్రే శ్రీనివాసరావు, కాశీ నవీన్ పాల్గొన్నారు.