June 11, 2013

బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ:చంద్రబాబు

బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం నిర్మించి స్థానిక గిరిజనులకే అందులో ఉద్యోగావకా శాలు కల్పించాలని విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధులు గన్‌పార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పోరాట ఫలితంగానే బయ్యారం గనులకు రక్షణ స్టీల్స్‌ నుంచి విముక్తి లభించిందని చెప్పారు. బయ్యారం విషయంలో ప్రభుత్వం ద్వంద్వ ప్రమా ణాలు పాటిస్తోందని విమర్శించారు. బయ్యా రం నుంచి ఇనుప ఖనిజం తరలించే యత్నా లను తమ పార్టీ సహించదని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ టీ. ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, ధనసరి అనసూయ, సత్యవతి రాథోడ్‌తో పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధులు ధర్నాలో పాల్గొనడం విశేషం. య్యారంలోనే ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామన్న హామీతో శాసనసభలో ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేయాలని తెలుగుదేశం శాసనసభా పక్షం మంగళవారం డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం నోటి మాటగా చెప్పే వాటికి, ప్రభుత్వ ఉత్తర్వుకు పొంతన కుదరడం లేదని చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ధనసరి అనసూయ, సత్యవతి రాథోడ్‌, సీతక్క తదితరులు టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వాస్తవానికి ఒప్పందం కుదరక ముందే వైఎస్‌ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌కు చెందిన సంస్థ 500 కోట్ల రూపాయల విలువైన ముడి ఇనుమును కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు తరలించిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. తాము ఆ వాహనాలను పట్టుకొని సీజ్‌ చేయిస్తే వైఎస్‌ విడిపించారని చెప్పారు. గడచిన 2009 ఆగస్టు నాలుగో తేదీన బయ్యారం అంశంపై శాసనసభలో ప్రస్తావించా మన్నారు. తాము అప్పటి నుంచి నిరంతరం చేసిన పోరాట ఫలితంగా 2010 డిసెంబర్‌లో ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకుందని చెప్పారు. తెలంగాణ ఆస్తుల పరిరక్షణలో తెలుగుదేశం పార్టీ ముందు వరుసన నిల్చుని పోరాడిందన్నారు. సంవత్సరం పైగా తాము పోరు సల్పిన కాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మెదలకుండా ఉందన్నారు. అదే విధంగా ఓబుళాపురం మైన్స్‌ విషయంలో ఒక్కసారైనా టీఆర్‌ఎస్‌ నోరు విప్పిందా? అని ప్రశ్నించారు. పైగా ఓబుళాపురంలో అంతా బాగానే ఉందని కితాబిచ్చింది టీఆర్‌ఎస్‌ అని విరుచుకుపడ్డారు.