April 16, 2013

ఆలోచించి ఓటు వేయాలి లేదంటే ప్రజల ఉనికే గల్లంతు

ఈ సారీ తప్పు చేస్తే మనుగడ లేనట్టే!
అది చెప్పేందుకే పాదయాత్ర చేస్తున్నా: బాబు

నాతవరం/విశాఖపట్నం:అధికారంలోకి వస్తే ఓసీ పేద విద్యార్థులకూ ఉపకార వేతనాలు అందిస్తామని బెన్నవరం సభలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలు, దోపిడీ వ్యవహారాలు చూస్తుంటే ఒక్కొక్కసారి పట్టలేనంత కోపం వస్తున్నా, మర్యాద కోసం తనను తాను అణచుకోవాల్సి వస్తున్నదని ములగపూడిలో జరిగిన సభలో పేర్కొన్నారు. వైఎస్‌ని మహానాయకునిగా కీర్తించిన కాంగ్రెస్ పెద్దలు.. నేడు ఆయనను, ఆయన కుమారుడు జగన్‌ను అవినీతిపరులుగా పేర్కొంటున్నారని, తీహార్ జైలుకు పంపించాలంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులందరూ తమ తప్పిదాల్లో భాగస్వాములేనని జగన్ అంటున్నారని, దీన్నిబట్టి తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు దొందూదొందేనని అర్థమవుతున్నదని చెప్పారు.

వైఎస్ తప్పుల్లో 'ఆత్మ' కేవీపీకి కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. "నన్ను ఒకప్పుడు ప్రపంచబ్యాంకు ఏజెంట్‌నని నిందించారు. అయితే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో లక్షా 60 వేల కోట్ల రూపాయలను ప్రపంచబ్యాంకు నుంచి అప్పుగా తెచ్చార''ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ప్రకటించినా సన్న, చిన్నకారు రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని చెప్పారు. అందరికీ రుణమాఫీ వర్తించేవిధంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేవలం మూడు వేల కోట్ల రూపాయల వరద, కరువు సాయమే కేంద్రం నుంచి అందిందన్నారు.

దీనికి సీఎం కిరణ్‌తోపాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, అధికార ఎంపీలు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతకుముందు విశాఖ జిల్లా నాతవరం మండలం యర్రవరం గ్రామంలో జరిగిన పాడేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. "మనమంతా ఒకే కుటుంబం...ఒకేమాట.. ఒకేబాటగా కలిసిమెలిసి కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉండాలి. కుటుంబంలో ఒకరికి బాధ కలిగితే మిగిలిన వారంతా ఆందోళన చెందినట్టు పార్టీలో ఒక కార్యకర్తకు కష్టమొస్తే అంతా కలిసి ఆదుకోవాలి. అదే తెలుగుదేశం పార్టీ. అటువంటి బంధం, అనుబంధం తెలుగుదేశం పార్టీకే సొంతం'' అని కార్యకర్తలను ఆయన ఉత్సాహపరిచారు.

చింతపల్లిలో పార్టీ కార్యకర్తపై మంత్రి బాలరాజు సోదరుడు కేసు బనాయించినా నాయకులు పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనేస్పందించాలని ఆదేశించారు. అంతేకాదు.. ప్రత్యర్థుల బెదిరింపులకు బెదరొద్దని, ఢీఅంటే ఢీ అంటూ తలబడాలని పిలుపునిచ్చారు. కాగా, విశాఖ శివార్లలోని అగనంపూడి టోల్‌గేటు సమీపంలో తలపెట్టిన పైలాన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
: "రానున్న ఎన్నికల్లో అన్నివిధాల ఆలోచించి ఓటు వేయాలి. ఈసారీ తప్పుచేస్తే చరిత్రలో ప్రజల ఉనికికే ప్రమాదం'' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా నాతవరం మం డలం ములగపూడి గ్రామంలో ఆయన పాదయాత్ర ప్రారంభించా రు. బెన్నవరం, కృష్ణాపురం, పైపురెడ్డిపాలెం, బలిఘట్టం మీదుగా నడక సాగించారు. ప్రజల బాధలు ఎవరికీ పట్టడం లేదన్న ఆ య న.. ఇప్పటికే రెండుసార్లు చేసిన తప్పిదం వల్ల వ్యవస్థ ఉనికికే ప్ర మాదం ఏర్పడిందని, మరోసారి అటువంటి తప్పిదం చేయకుండా వుండేలా ప్రజలను అప్రమత్తం చేయడానికే పాదయాత్ర చేపట్టానని వివరించారు.