April 16, 2013

'తూర్పు'పై బాబు ప్రత్యేక దృష్టి


కాకినాడ:చంద్రబాబు జిల్లాలో ఇరవై నా లుగు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. బాబు వెంట హిందూపు రం నుంచీ ఫాలో అవుతున్న కొంతమంది పార్టీ సీనియర్లు నియోజకవర్గాల వారీగా పార్టీ, నేతల స్థితిగతులపై ఎప్పటికప్పుడు నివేదికలు రూ పొందించారు. ఈ నివేదికలు, అంతకుముందు ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన రిపోర్టులను బేరీజు వేసుకుని చంద్రబాబు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా విశాఖ జిల్లాకు రప్పించుకుని సమీక్ష జరుపుతున్నారు.

మార్చి 20 నుంచి ఏప్రిల్ 13 వరకు జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఈ 24 రోజుల్లో జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమీక్ష సమావేశాలను పూర్తి చేశారు. మధ్యలో నేతల మధ్య సమన్వయలోపాలపైనా మాట్లాడారు. అ యినా కొన్ని నియోజకవర్గాల్లో సమ స్య పరిష్కారంకాలేదు.

కార్యకర్తల పనితీరు భేష్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యకర్తల పనితీరు మెరుగ్గా ఉందని చంద్రబాబు కితాబునిచ్చారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతోనే ఎక్కువ సమస్యలున్నాయని, వారిలో మార్పు రావాలని పదేపదే ప్రస్తావించారు. చా లాకాలంగా ఉదాసీనంగా ఉన్న నేత ల్లో ఒక్కసారిగా మా ర్పు రావాలని కోరుకోవడం చంద్రబాబుకు సైతం అ త్యాశే అవుతుంది.ప్రత్యామ్నాయం లేక కొన్నిచోట్ల ఆ ఉదాసీనంగా ఉండే నాయకులకే ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెట్టాల్సిన దుస్థితి నెలకొంది.

కఠిన నిర్ణయాలకు వెనుకంజ జిల్లాలోని ఏడెనిమిది నియోజకవర్గాల్లో అసమర్ధులైన ఇన్‌చార్జిలు వున్నారని పార్టీ పరిశీలకులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వీరిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తేనే పార్టీ మనుగడ సాధిస్తుందని బాబుకు చేరిన నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలని కూ డా పరిశీలకులు చంద్రబాబుకు గట్టిగా చెప్తున్నారు.

మార్పులు, చేర్పులకు సిద్ధపడతారా?


చంద్రబాబునాయుడుకి జిల్లాలో ని సీనియర్లతో కొంత మొహమాటం వుంది. ఆ సీ
నియర్ల మాట కాదని ఇన్‌చార్జిలను మార్చి... కొత్తవారికి , యువకులకు ఆ బాధ్యతను అప్పగించే సాహసం చంద్రబాబు చేయగలరా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ తనతో అనుబంధం ఉన్న నేతల మాటను కాదనలేక... ఇటు అసమర్ధులైన ఇన్‌చార్జిలను కొనసాగించలేక చంద్రబాబు కూడా కొంత సతమతమవుతున్నారు.

'తూర్పు'పై బాబు ప్రత్యేక దృష్టి 'ఆబ్లిగేషన్లతో టికెట్లిస్తే జిల్లాలో అవకాశం వున్న సీట్లు సైతం కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో పార్టీ అధినేత సీరియస్‌గా దృష్టిసారించాలి. సీనియర్ల మాటను సున్నితంగా తిరస్కరించి, కొత్తవారికి, సమర్ధులకు అవకాశం కల్పిస్తే తప్ప గెలిచే చోట సైతం ఆరేడు స్థానాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది..'' అంటూ... జిల్లాకు చెందిన ఒకరిద్దరు నేతలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.