April 16, 2013

'టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యం'

ఖానాపూర్: తెలుగుదేశం పార్టీ అ«ధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పరిష్కరించలేకపోతున్నారని అన్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చి వెళ్లినా జిల్లా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని, సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్, ట్రైబల్ వెల్ఫేర్ వైద్య శాలలో ఖాళీలు ఉన్నప్పటికీ నేటికీ భర్తి చేయడం లేదని, జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ఉన్నా ఎలాంటి పనులు చేయడం లేదని ఆరోపించారు.

శ్మశాన వాటికకు నిధులు ఖానాపూర్ పట్టణంలోని గోదావరి నది తీరంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని హిందూ ఉత్సవ కమిటీ నా యకులు అల్లాడి వెంకటేశ్వర్లు, భవాని నర్సయ్య, నాయిని లక్ష్మణ్ ఎంపీ రాథోడ్ రమేష్‌తో వినతి పత్రం సమర్పించి విన్నవించారు. ఎంపీ మాట్లాడుతూ శ్మశాన వాటిక కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఎంపీ పరామర్శ ఖానాపూర్ మండల కేంద్రంలో చనిపోయిన బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించి వారికి రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఎలాం టి సమస్య ఉన్న తమతో చెప్పుకోవాలని సూచించారు.

ఎంపీ వెంట మాజీ జడ్పీటీసీ రామునాయక్, మాజీ మం డల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, అధికార ప్రతినిధి డా. చాంద్‌పాషా, సహకార సంఘం చైర్మన్ ఆకుల వెంకాగౌడ్, నాయకులు రాజ్‌గంగన్న, ప్రదీప్, రాజన్న, రాజేంధర్, నయీం, షబ్బీర్ పాషా, సలీమ్‌ఖాన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.