April 16, 2013

నాయకులు వెళ్లిపోవడం టీడీపీకి కొత్త కాదు...కార్యకర్తలు నీతి తప్పడం లేదు.. వారే మా ఆస్తి: బాబు

టీఆర్ఎస్‌కు గెలిచే సత్తా లేదు
ఆ పార్టీకి అసలు కార్యకర్తలే లేరు
ప్రలోభపెట్టి తీసుకెళుతున్నారు
ఫిరాయింపుల కోసం డెడ్‌లైన్లు పెట్టేందుకు సిగ్గుండాలి: నర్సిరెడ్డి

హైదరాబాద్, విశాఖపట్నం/ నాతవరం:2004 కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న టీఆర్ఎస్ 50 సీట్లలో పోటీచేసి 20 సీట్లలో గెలుపొందిందని... 2009లో తమతో పొత్తుపెట్టుకుని 40 సీట్లలో పోటీ చేసి పది సీట్లలో మాత్రమే గెలుపొందిందని అన్నారు. సంచలనాల కోసం ఏదో ఒకటి చేయడం తప్ప విజయం దక్కించుకునే సత్తా టీఆర్ఎస్‌కు లేదని ధ్వజమెత్తారు. "కరీంనగర్ ఎమ్మెల్యే వెళ్లాడు తప్ప ఆయన వెంట కార్యకర్తలెవరూ వెళ్లలేదు. నాయకులు వెళ్లిపోవడం టీడీపీకి కొత్త కాదు. నాయకుల్లో స్వార్థం పెరిగింది. కార్యకర్తలు మాత్రం నీతి తప్పలేదు. వారే టీడీపీ ఆస్తి'' అని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా.. "కేసీఆర్ గతంలో తెలంగాణ కోసం డెడ్‌లైన్లు పెట్టేవారు. అవి అయిపోయాయి. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కోసం డెడ్‌లైన్లు పెడుతున్నారు. ఇలాంటి డెడ్‌లైన్లు పెట్టడానికి సిగ్గుండాలి. ఈ దివాళాకోరు పార్టీకి ప్రజలు 2014లో డెత్‌లైన్ పెట్టడం ఖాయం'' అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల వారంతా చవటలు, దద్దమ్మలని తిట్టిన కేసీఆర్... ఇప్పుడు అదే పార్టీల వారి కోసం వెంపర్లాడుతూ, వారి ఇళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. తనతో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సంప్రదింపుల్లో ఉన్నారని కేసీఆర్ గొప్పగా చెబుతున్నారని, అదే నిజమైతే వారి పేర్లు బయటకు చెప్పే దమ్ముందా? అని నర్సిరెడ్డి మండిపడ్డారు.

"తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన నళినిని అవమానించి పంపావు. టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన నాగం జనార్ధనరెడ్డి పట్ల ఎంత అన్యాయంగా వ్యవహరించావో అందరికీ తెలుసు. అమర వీరుల కుటుంబాలను ఉపన్యాసాల కోసం వాడుకోవడం తప్ప అభ్యర్థులుగా పోటీకి అంగీకరించవు. నీకు, నీ కుటుంబ సభ్యులకు పదవులు, వ్యాపారాలే ముఖ్యం. దానికి తెలంగాణ ఉద్యమం ఒక ముసుగు'' అని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతున్న జగన్‌ను కలవాలంటే జైలుకు, మరో పార్టీని నడుపుతున్న కేసీఆర్‌ను కలవాలంటే ఫాంహౌస్‌కు వెళ్లాల్సి వస్తోందని... ఒక్క చంద్రబాబును కలవడానికే జనం మధ్యకు వెళ్ళాలని నర్సిరెడ్డి పేర్కొన్నారు.
: వలస రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అసలు టీఆర్ఎస్‌కు గెలిచే సత్తా లేదని, అసలు ఆ పార్టీకి కార్యకర్తలే లేరని విమర్శించారు. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న చంద్రబాబు మంగళవారం పాడేరు నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. "టీఆర్ఎస్ అధినేత ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేస్తారు. తరువాత ప్రజలను మోసం చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తుంటారు. కరీంనగర్‌లో మా పార్టీ ఎమ్మెల్యేను అలా ప్రలోభపెట్టే తీసుకువెళ్లారు'' అని చంద్రబాబు ఆరోపించారు.