September 5, 2013

వైఎస్ దోపిడీ వల్లే పులి'చింతలు'

 పులిచింతల ప్రాజెక్టులో వైఎస్ కోట్ల రూపాయలు దోచేశాడు, అందువల్లే ప్రాజెక్టు పూర్తికా చింతలు మిగులుస్తోంది అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాను సంస్కరణలు అమలు చేసి సంపదను సృష్టిస్తే వైఎస్ రూ. లక్ష కోట్లు దోచేశాడన్నారు. మళ్లీ ఏమాత్రం ఏమారినా ఈసారి సంచి నిండా డబ్బులు తీసుకెళితే జేబు నిండా కూడా సరుకులు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. బుధవారం జిల్లాలో చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర పెదకూరపాడు నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా బాబు కాంగ్రెస్ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. వాళ్లు దుర్మార్గులు, నీచులు, కీచకులు, అరాచకాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదో దొంగల పార్టీ అని, నీతిగా రాజకీయాలు చేసేది కా దని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ బుద్ధుడు నడియాడిన అమరావతిలో కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తోందని, ఇదే పద్ధతిని కొనసాగిస్తే ఖబడ్దార్ జాగ్రత్త... మీకు శంకరగిరి మాన్యాలే గతి అవుతుందని గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. పెదకూరపా డు, అబ్బరాజుపాలెం, 75 తాళ్ళూరు, పరస, లింగాపురం, ధరణికోట మీద గా అమరావతికి చేరుకొన్నది. పంచాయతీ ఎన్నికల సమయంలో అమరావతి సర్పంచ్‌గా తొలుత టీడీపీకి చెందిన ప్రసన్నలక్ష్మి గెలుపొందినప్పటికీ రీకౌంటింగ్ చేసి అధికార పార్టీ నేతలు ఫలితాన్ని తారుమారు చేశారని స్థానిక 'దేశం' నేతలు చంద్రబాబు దృ ష్టికి తీసుకొచ్చారు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహోదగ్ధుడయ్యారు. అమరావతిలో వాస్తవంగా మనమే గెలిచాం. కాంగ్రెస్ దొంగలు దొంగతనంగా గెలిచారు. దానిపై న్యా యపోరాటం చేస్తాం. తప్పక మంచిపార్టీ అయితే తెలుగుదేశానికే విజయం వరిస్తుందన్నారు.
నాల్గో రోజు యాత్రలో చంద్రబాబు సీమాంధ్ర ఆందోళనలను సమర్థిస్తూనే స్థానిక సమస్యల పైనా ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే పల్లెల్లో రోడ్లు, వీధిలైట్లు, కాలువల ఏర్పాటు వంటివి జరిగాయని, కాంగ్రెస్ దొంగలు ఏమి చేయలేదన్నారు. నిత్యవసర సరుకుల ధరల గురించి చంద్రబాబు మాట్లాడుతూ తాను ఉం డగా కేజీ రూ. నాలుగు ఉంటే నేడు రూ. 80కి చేరిందన్నారు. బియ్యం ఆ రోజున కేజీ రూ. 7.50కే ఎంత కావాలంటే అంత ఇచ్చామన్నారు. నేడు కేజీ రూ. 50కి చేర్చారు. లింగాపురం వద్ద రైతులతో చంద్రబాబు సంభాషించా రు. ఎరువులు, విత్తనాలు, మద్దతు ధరల గురించి వాకబు చేశారు. ఎరువుల ధరలు అందకుండా పోయాయి. రూపాయి పతనం డాలర్‌తో రూ. 120కి చేరితే ఇప్పుడున్నదాని కంటే రెట్టింపు అవుతాయన్నారు.
ధరణికోటలో విద్యార్థినులతో చం ద్రబాబు సంభాషించారు. మీరు ఈ రోజున చదువుకొంటే ఉద్యోగాలు వ స్తాయో, రావోనని భయపడుతున్నా రు. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటేనే భీతిల్లుతున్నారు. దీనంతటికి కారణం కేంద్ర ప్రభుత్వమే. నిర్భయ కేసు నిందితులకు కేవలం మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే పడిందంటే ప్రధాని ఎంత బలహీనుడో స్పష్టం అవుతోంది. నేనైతే ఉరిశిక్ష వేసి ఉండేవాడనని చెప్పారు. అబ్బరాజుపాలెం, అమరావతి, లింగాపురంలో పలుచోట్ల చిన్నపిల్లలను తన వాహనం పైకి చంద్రబాబు ఎక్కించుకొని వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. 'ఏమమ్మా మీ పిల్లాడిని మీరు బాగా చదివించాలని అనుకొంటున్నారు. ఆ పిల్లలు కోసమే మీరు జీవిస్తున్నారు. వాళ్లు జైలుకు వెళ్లాలని మీరు కోరుకోరు.
జైలుకు వెళితే ఎంత అవమానం. ఇంకోపక్క జగన్ జైలుకెళ్లి రాజకీయాలు చేస్తున్నాడు. ఆయనేమైనా ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకు వెళ్ళాడా అంటే కాదు. మీకు చెందాల్సిన రూ. కోట్ల సంపదను దోచేసి జైలుకెళ్ళాడని, దీనిని గ్రహించి ఆయన పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.
ధరణికోటలో ఇసుక క్వారీని మూసేయడం కాంగ్రెస్ మాఫియా పనేనన్నారు. న్యాయంగా క్వారీయింగ్ జరుగుతోన్న వాటిని మూసేసి తద్వారా వేరొక చోట్ల తవ్వకాలు జరిపి కోట్లు దండుకోవడం వారి పని అని ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ గెలిచివుంటే ఈ కుట్ర ఉండేది కాదు
పాదయాత్రలో నేను ప్రకటించిన రుణమాఫీ, రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్‌లు నమ్మి మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. జగన్ పార్టీని రెండు జిల్లాలకే పరిమితం చేశారు. ఇంకోపక్క టీఆర్ఎస్ ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు. దాంతోనే కాంగ్రెస్ ఒక దారుణమైన, భయానకరమైన నిర్ణయం తీసుకొంది. అదే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచివుంటే ఈ కుట్ర ఉండేదే కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
మొద్దబ్బాయి... దొంగబ్బాయి సూక్తికి విశేష స్పందన
రాహుల్‌గాంధీని మొద్దబ్బాయి. జగన్‌ను దొంగబ్బాయి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రజలు కేరింతలు కొట్టారు. వారిద్దరూ ప్రధాని, సీఎం అయితే ప్రజల జీవితాలు సర్వనాశనం అయిపోతాయన్నారు. దొంగబ్బాయికి మీరు ఓట్లేస్తారా? మొద్దబ్బాయికి సహకరిస్తారా అంటూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. ఇటలీ సోనియా, ఇడుపులపాయ విజయలక్ష్మికి లంకె కుదిరిందంటూ వర్ణించిన తీరుకూ ప్రజలు విశేషంగా స్పం దించారు. విజయలక్ష్మి నంగి నంగి మాట్లాడుతున్నారు. మాలో ఎన్‌టీఆర్ పౌరుషం, స్ఫూర్తి ఉంది. ఇది గుర్తు పె ట్టుకోండి. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదని చంద్రబాబు హెచ్చరించారు.
కొమ్మాలపాటి జోరు
పెదకూరపాడు రెండు రోజుల పాటు జరిగిన చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రకు భారీగా జనస్పందన తీసుకురావడంలో ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సఫలీకృతులయ్యారు. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ మొత్తాన్ని ఒక తాటి పైకి తీసుకొచ్చి ప్రతీ గ్రామంలో చంద్రబాబు యాత్ర సక్సెస్ అయ్యేలా చేశారు. ఇంచుమించు 20కి పైగా గ్రామాల్లో యాత్ర కొనసాగింది.
అమరావతి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు తరలిరావడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది. జనస్పందన విశేషంగా ఉండటం వలన బుధవారం షెడ్యూల్‌లో మార్పు చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రికే తాడికొండ నియోజకవర్గంలోని రావెల గ్రామానికి చంద్రబాబు చేరుకోవాల్సి ఉండగా మోతడక వద్దనే ఆగిపోయారు.
జోరు వర్షంలోనూ...
అమరావతి సభ ముగియగానే అక్కడ భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ చంద్రబాబు యాత్రను కొనసాగించారు. వర్షంలోనూ నరకుళ్లపాడు, యండ్రాయి, లేమల్లె మీదగా మోతడకలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకొని అక్కడ బస చేశారు. చంద్రబాబు వెంట బస్సుయాత్రలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జే ఆర్ పుష్పరాజ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, డాక్టర్ శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, జీ వీ ఆంజనేయులు, పార్టీ నేతలు వై వీ ఆంజనేయులు, వెన్నా సాంబశివారెడ్డి, మన్నవ సుబ్బారావు, మానుకొండ శివప్రసాద్, ఎన్‌వీవీఎస్ వరప్రసాద్, ములకా సత్యవాణి, నల్లపనేని విజయలక్ష్మి, పానకాల వెంకటమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు