May 30, 2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు విరుచుకుపడ్డారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాలేదని ఆ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని తపబట్టారు. దేశాన్ని దోచుకున్న దొంగలందరూ కలిసి సంఘంగా ఏర్పడి ధర్నాలు చేస్తే దేశ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిపలు చెరిగారు. సీఎం కిరణ్‌కు పాలన అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. బుధవారం కాకినాడకు చెందిన పోతుల విశ్వం టీడీపీ అధినేత నివాసంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన కార్యకర్తల నుద్దేశించి బాబు ప్రసంగించారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, ఆఖరికి జైళ్లనూ వదల్లేదని ఆరోపించారు. అక్రమార్కులు జైలులో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నా రని, తాగుడు, నీలి చిత్రాలు చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి, ప్రజల సొత్తును దోచుకొని జైలుపాలైన జగన్‌కు బెయిల్ రాలేదని వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేయడం దారుణమన్నారు. అక్రమార్కులు, అవినీతిపరులు, దొంగలు రోడ్లపై ధర్నాలు చేస్తూ దేశాన్ని ఎటు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దొంగలందరూ కలిసి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. వీరిని చూసి హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా? నిజాయితీగా పని చేస్తున్న సీబీఐకి వ్యతిరేకంగానా? వైఎస్సార్‌సీపీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. బెయిల్ ఇవ్వకపోతే పిల్ల కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్లలాగా తాము దోచుకొని పత్రికలు, చానెళ్లు సంపాదించలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీకి పత్రికలు, చానెళ్లు లేవని.. కార్యకర్తలే పత్రికలు, చానెళ్లలాగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తాను వారిలాగా అవినీతికి పాల్పడలేదని.. నిపలా బతికానని, అందుకే తనపై ఎన్ని కేసులు వేసినా నిలబడలేదన్నారు. అవినీతిపై వైఎస్ ఉన్నపడు పోరాడానని, ఇపడు పోరాడుతున్నానని చెప్పారు. సీఎం కిరణ్‌పైనా బాబు నిపలు చెరిగారు. పరిపాలన చేతగాని సీఎం వసూళ్లకు తెరలేపరాని ఆరోపిం చారు. ఆయన సోదరులను రాజ్యాంగేతర శక్తిగా మార్చారన్నారు. అభివృద్ధి పనుల నిధుల నుంచి కవిూషన్లు తీసుకుంటున్నారని, కాం ట్రాక్టర్ల నుంచి డబ్బు వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. వాళ్లు ఫైళ్లు తీసుకొని వస్తే.. ముఖ్యమంత్రి సంతకాలు చేస్తున్నారన్నారు. అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ముందుంది మంచి కాలం అని ప్రభుత్వం అంటోందని.. అలా అంటే ఇపడు ఉన్నది చెడ్డకాలమనేగా? అని ప్రశ్నించారు.