July 16, 2013

చంద్రబాబు పాలనే… ‘ఒకే ఒక్కడు’


Oke-Okkadu-film-themed-on-C

గ్రేట్   డైరెక్టర్ శంకర్ “ఒకే ఒక్కడు” సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఓ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు ఇన్ స్ప్రెషన్ ఎవరూ తెలుసా.. ! తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. దర్శకుడు శంకర్ ఈ సినిమాకి చంద్రబాబు నాయుడు ఆడ్మినిస్ట్రేషన్ స్టయిల్ ను కథాంశంగా తీసుకున్నాడట. ఇందుకోసం శంకర్ కొన్ని రోజులపాటు బాబుతో తిరుగుతూ… దగ్గరగా పరిశీలించాడట. ఈ విషయలాన్నింటిని వ్యక్తం చేసిందే ఎవరో కాదండోయ్… స్వయంగా తెదేపా అధినేతనే ఓ ఫంక్షన్ లో.. సన్నిహితుల వద్ద వెల్లడించారని సమాచారం.
ఇంకాస్త వివరంగా.. ’ఒకే ఒక్కడు’ మూవీ ముందు చోటు చేసుకున్న విషయాలను గమనిస్తే.. భారతీయుడు, జెంటిల్ మెన్ లాంటి బిగ్గెస్ట్ హిట్ లతో అప్పుడప్పుడే శంకర్ మంచి దర్శకుడిగా గుర్తింపు పొందుతున్న సమయంలో.. ఓ వేదికపై చంద్రబాబును కలిసాడు. బాబు అడ్మినిస్ట్రేషన్ ను ఇష్టపడే శంకర్.. చంద్రబాబును దగ్గర నుండి పరిశీలించడానికి అవకాశం ఇవ్వమని కోరాడట. ఇందుకోసం కొన్ని రోజులు మీతో పాటు తిరుగుతానని శంకర్ అభ్యర్థించడం.. బాబు అంగీకరించడం జరిగిపోయాయి. అయితే, వీరి కొన్ని రోజుల ప్రయాణంలో శంకర్ అడిగిన ప్రశ్నలకు బాబు ఇచ్చిన సమాధానాలలోంచి పుట్టిందే “ఒకే ఒక్కడు” సినిమా.
నేను మంచి ‘ఆడ్మినిస్ట్రేటర్’ ను కావడం వలన 50 శాతం సామాన్య ప్రజల సమస్యలను తీర్చగలుగుతున్నాను. మరో 50 శాతం ప్రజలకు అభివృద్ధి చెందడానికి అవకాశాలు కలించడం, వారి వారి వ్యాపార నైపుణ్యాని పెంచుకోవడానికి దోహదపడుతున్నాని బాబు.. ఓ సందర్భంలో శంకర్ తో అన్నాడట. అవును మరీ అందుకే ప్రపంచ పటంలో ఆంధ్రపదేశ్ ను ఉంచగలిగాడని ఆ సమయంలో గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా భావించాడట.
గ్రేట్ డైరెక్టర్ శంకర్ ఒక్కడే కాదండీ.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరూ.. అనే మాటలివే. ఎందుకంటే.. ఇటీవల చేపట్టిన “వస్తున్నా.. మీకోసం” పాదయాత్రనే తీసుకోండి. ఆరోగ్యం సహకరించడం లేదు.. పాదయాత్రకు బ్రేక్ ఇవ్వండని ఎందరన్నా.. ’నేను నడవగలను నడుస్తానంటూ..’ ముందుకు సాగాడు. మొదటి పాదయాత్ర అనుకున్నది కూడా 117 రోజులే.. కానీ ఇంకా ఎక్కువ మంది ప్రజల కలవాలనే తాపత్రయంతో.. బాబు పాదయాత్రను 208 రోజుల వరకు అలుపెరగకుండా కొనసాగించిన విషయం తెలిసిందే. అందుకే రాజకీయ నాయకుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంలో బాబు ఎప్ప్పటికినీ.. “ఒకే ఒక్కడే”.