March 7, 2013

టీడీపీ నగర నేతలపై బాబు ఆగ్రహం


హైదరాబాద్ నగరంలో తెలుగు తమ్ముళ్ల కీచులాటలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆగ్రహం తెప్పించాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ విమర్శలకు దిగితే ఊరుకొనేది లేదని ఆయన వారిని హెచ్చరించారు. హైదరాబాద్ నగర టీడీపీ కమి టీ నియామక వ్యవహారం ఆ పార్టీలో చిచ్చు రేపింది. పార్టీ నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస యాదవ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల అభిప్రాయాలతో నిమి త్తం లేకుండా ఏకపక్షంగా తనకు నచ్చి న వారితో కమిటీ వేసి దానిని ప్రకటించారని కొందరు నగర నేతలు పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారు. అందరినీ అడిగే వేశానని తలసాని చెబుతున్నా రు. ఈ నియామకాలను నిరసిస్తూ తలసాని వ్యతిరేక వర్గీయులు బహిరం గ ప్రకటనలు చేశారు. వారికి వ్యతిరేకంగా తలసాని వర్గీయులూ ప్రకటనలు చేశారు.

కొన్నిచోట్ల ఈ రెండు వర్గాల నేతలు పరస్పరం తలపడ్డారు. ఈ మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు వద్దకు చేరింది. 'ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా దానిని పార్టీ నేతల దృష్టికి తీసుకురండి. వారితో చర్చించండి. కాని బహిరంగ విమర్శలకు దిగితే ఊరుకొనేది లేదని హెచ్చరించినట్టు సమాచారం. ఇరు వర్గాల వారితో మాట్లాడి సమస్య ఏమిటో తెలుసుకొని తనకు చెప్పాలని ఆయన హైదరాబాద్ నగర ఇన్‌ఛార్జి మోత్కుపల్లి నర్సింహులుకు సూచించారు.