March 7, 2013

కష్టపడి పని చేసేవారిదే భవిష్యత్తు


నియోజకవర్గంలో ఎంతమంది నాయకులున్నా ఎమ్మెల్యే టికెట్ ఒక్కరికే వస్తుంది...అయితే ఆ ఒక్క ఎమ్మెల్యే పదవే కాదు ఇంకా చాలా పదవులున్నాయి.. టికెట్ ఎవరికి వచ్చినా అందరు కలసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించండి..కష్టపడి పనిచేసే వారికే సముచితస్థానం ఉంటుంది అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. మదనపల్లెలోని ఆర్అండ్‌బీ అతిథి గృహం లో మంగళవారం మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గ నాయకులతో సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ లో నాయకులు ఎక్కువమంది అవుతుండడంతో క్రమక్రమంగా కార్యకర్తలను పట్టించుకునేవారు తగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి నుంచి బయటపడి పార్టీ కి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నాయకులందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పడుతున్న కష్టంలో పదో వంతు మనమంతా కష్టపడ్డా 2014లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో టీడీపీ గెలిచే స్థానాల్లో కూడా ఓటమి పాలుకావడం బా ధాకరమన్నారు. దీనిపై మండల స్థాయి లో సమావేశాలు నిర్వహించి ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాలన్నారు. రాను న్న స్థానిక, మున్సిపల్ ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుం చి పార్టీని బలోపేతం చేసేలా కమిటీలు ఏ ర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలో వార్డుకు 15మందితో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి ఈనెల 9న చిత్తూరులో జరిగే సమావేశంలో అందజేయాలన్నారు. ఈనెల 11 నుంచి ప్రతి నియోజకవర్గంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని నాయకులకు సూచించారు.ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు ప్రకటించిన రైతులకు వడ్డీమాఫీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం డిక్లరేషన్‌లతో పాటు కాంగ్రెస్ ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానా లను ప్రజలకు వివరించాలన్నారు.

మూడునెలల క్రితం వరకు వైసీపీ హవా ఉందని అం దరూ భావించారని, అయితే సహకార ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మూడోస్థానానికే పరిమితం కావడం, కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగుచెంది వున్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీకే మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు.జిల్లా నాయకుల ముందు నియోజకవర్గ పరిస్థితులపై వివిరిస్తున్న సమయంలో మిట్స్‌కృష్ణకుమార్, రాటకొండ మధుబాబు వాగ్వాదానికి దిగడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, నాయకులు గంగారపురాందాస్‌చౌదరి, కొడవలి శివప్రసాద్, రాటకొండబాబురెడ్డి, నాదేళ్లవిద్యాసాగర్, ఎస్.ఎ.మస్తాన్, రాటకొండగుర్రప్ప నాయుడు, పోతుల విజయ్‌కుమార్, దొరస్వామి నాయుడు, వల్లిగట్ల రెడ్డెప్ప, రాటకొండ శోభన్, నీలకంఠ, కామకోటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.