March 7, 2013

మా ఊరికి రావాలి

'మన పార్టీ నాయకుడు పాదయాత్ర మా ఊరి మీదుగా వెళ్లేలా చూడండి. చిన్న చిన్న మార్పులేమైనా ఉంటే చేయండి. మాకూ ఓ అవకాశం ఇవ్వండి. బాబు మా ఊళ్ల వైపు నడిస్తే పార్టీ మరింత పట్టు వస్తుంది. ఆయనను ఒప్పించి అయినా సరే ఇది జరగాల్సిందే' ఇదీ టీడీపీ నేతల్లో కొందరు పట్టుదల. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర ఈ నెల 9న జిల్లాలో ప్రవేశించబోతోంది. దీనికి సంబంధిం చి గడిచిన వారం రోజులుగా పార్టీ జి ల్లా నేతలు తీవ్రస్థాయిలో కసరత్తులు కొనసాగిస్తున్నారు. పార్టీ ముఖ్యులం తా రూట్‌మ్యాప్ ఖరారులో తలమునకలయ్యారు. ఒక దఫా 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగేలా ఒక రూట్‌మ్యాప్‌ను ర్రాష్ట పార్టీకి సమర్పించారు.

అయితే దీనిని కుదించాల్సిందేనని, ప్రస్తుతం పార్టీ అధినేత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని కుదించాలని జిల్లా కమిటీకి తిరుగు టపా పంపించారు. దీంతో రూట్‌మ్యాప్‌ను స్వయం గా చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఈ నేప«థ్యంలో పాదయాత్ర జిల్లాలో పది రోజుల వరకే కుదించాల ని చంద్రబాబే స్వయంగా సూచించా రు కూడా. దీనిపై చర్చించేందుకు పార్టీ సీనియర్లు డాక్టర్ కోడేల శివప్రసాదరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాగంటి బాబు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మితో పాటు మిగతా ముఖ్యులు సోమవారం ఏలూరులో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.

పాదయాత్ర ఏర్పాట్లు, నేతల సమన్వయం, తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు కూడా వచ్చాయి. అయితే పార్టీలో నియోజకవర్గాలకు చెందిన ముఖ్యులు కొందరు మాత్రం బాబు పాదయాత్ర తమ గ్రామాల మీ దుగా సాగేలా చూడాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేశారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ ఆయన పాదయాత్ర ఎక్కువ సమయం గ్రామీణ ప్రాంతాల్లోనే సాగేలా రూట్‌మ్యాప్ ఉండాలని మరికొందరు సూచించారు. ప్రధాన రహదారుల మీదుగా కాకుండా కీలకమైన గ్రామాల మీదుగానే బాబు పాదయాత్ర కొనసాగేలా చూడటం ద్వారా పార్టీలో మరికాస్త గట్టి ఊపునకు పునా ది వేయాలని కూడా ఇంకొందరు సల హా ఇచ్చారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు పది రోజుల పాటు మా త్రమే జిల్లాలో పర్యటించేలా రూట్‌మ్యాప్‌కు తుది రూపునిస్తున్నారు. పదకొండు మండలాలు, పది రోజులు, 120 కిలోమీటర్లు, ఈ మూడింటినీ క్రోడీకరించి రూట్‌మ్యాప్‌ను దాదాపు ఒక కొలిక్కితెచ్చినట్లు సమాచారం. దీ నికి ఇంకా ర్రాష్ట పార్టీ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. రోజుకు పది నుంచి 12 కిలోమీటర్ల చొప్పున మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు పాదయాత్ర కొనసాగేలా కూడా యాత్ర ఏర్పాట్లకు నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు.