April 5, 2013

విద్యుత్ చార్జీలను తగ్గించాలని టీడీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

మేడ్చల్ : పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించడంతో పాటు రైతులకు అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్ నక్క ప్రభాకర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు నారెడ్డి నందారెడ్డి, మండల అధ్యక్షుడు మద్దుల శ్రీనివాస్‌ర్‌డ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం మేడ్చల్ పట్టణంలో వివేకానంద విగ్రహం వద్ద జాతీయరహదారి పక్కన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్యాంరావు, పట్టణ అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, నేతలు శేఖర్‌గౌడ్, రమేశ్‌ముదిరాజ్, శైలేందర్, రమేశ్, కాశీ, పాండు, ప్రతాప్, వెంకటేశ్, రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు పోరాటం శామీర్‌పేట : పెంచిన విద్యుత్ చార్జీలు, విద్యుత్ కోతలు తగ్గించే వరకు టీడీపీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి నక్క ప్రభాకర్‌గౌడ్ అన్నారు. గురువారం శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లో విద్యుత్ కోతలు, చార్జీలకు నిరసనగా మండల అధ్యక్షుడు హరిమోహన్‌రెడ్డి అధ్వర్యంలో సంతకాల పేకరణ జరిగింది.

ఈ సందర్భంగా ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికే ఇంధన సర్‌చార్జి పేరిట వేలాది కోట్లు రూపాయలు ప్రజల నెత్తిన రుద్దిందని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సునీత, కోల అంజయ్య, నాలిక యాదగిరి, బోజేశ్వర్, నర్సింగ్‌రావు, అజయ్‌లక్ష్మీ, ర వీందర్‌గౌడ్, రవికిరణ్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.