April 5, 2013

సిగ్గూ శరం వదిలేశారు..


"విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి.. వైఎస్, కాంగ్రెస్ బృందం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. వైఎస్, జగన్ అక్రమాలవల్ల రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల దోపిడీ జరిగింది. 'నీకది.. నాకిది' పద్ధతిలో వెనకేసిన సొమ్ముతో జగన్ పత్రిక, టీవీలను పెట్టారు. వాళ్లు చరిత్రహీనులుగా మిగిలిపోతారు'' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ ఇంత దోచుకున్నా కొంతమంది ఆయనకే మద్దతు ఇస్తున్నారని.. అలాంటివారికి ఓటేస్తే మొత్తం రాష్ట్రాన్నే ఊడ్చేస్తాడని చేబ్రోలు సభలో ఓ కార్యకర్త బాబు దృష్టికి తీసుకువచ్చారు.

దానికి స్పందించిన బాబు.. "ఔను తమ్ముడూ.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తండ్రీ, కొడుకూ దారుణంగా.. సిగ్గులేకుండా దోచుకున్నారు. జగన్ తనకు రూ.10 కోట్లిస్తే.. రూ.100 కోట్ల లబ్ధి చేకూరుస్తానంటూ.. తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు రూ.10 లక్షల కోట్లు చిల్లు పెట్టారు'' అని మండిపడ్డారు. కాశీకి వెళ్లినవాళ్లు తమకు ఇష్టమైనవి వదిలేస్తారని, వైఎస్ సిగ్గు, శరం వదిలేశారని చంద్రబాబు ఎద్దేవాచేశారు.