April 5, 2013

బహుదూరపు బాటసారి కోసం ఎర్రమట్టి దారి

తుని: ఆయన వయస్సు 62 ఏళ్లు... ఓ పక్క ఆరోగ్యం సహకరించడం లేదు... అయినా ముందున్న లక్ష్యాన్ని చూసి వెరవడం లేదు. వేల కిలోమీట ర్లు అలవోకగా నడిచేస్తున్నారు. ముది మి మీద పడుతున్న వయస్సులో మితిమీరిన నడకతో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. వీటిని అధిగమించేందు కు వైద్యుల సూచనలు, సలహాలు పా టిస్తున్నారు. అందులో భాగంగానే ఆ యన పక్కనే నిక్షేపంలాంటి రోడ్లున్నా వాటిని కాదని పక్కనున్న మట్టి బెర్మ్ మీద నడవాల్సి వస్తున్నది. ఆయనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు పాదయాత్రతో రాష్ట్రాన్ని ప్ర జా సమస్యలను తెలుసుకుని అధికారంలోకొచ్చాక వాటి పరిష్కరించాలన్న ఆశయంతో 'వస్తున్నా.. మీకోసం' యాత్ర కు శ్రీకారం చుట్టారు.

సగం యాత్ర పూర్తి చేశాక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కాలినొప్పి, మోకాళ్ళు పట్టేయ డం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయన్ను పరీక్షించిన వైద్యు లు వేలకిలోమీటర్ల దూరం సిమెంట్, తారు రోడ్లపై నడిస్తే మురుకులు అరిగిపోయే ప్రమాదముందని చెప్పారు. రోడ్డును వదలి పక్కనే ఎర్ర మట్టిదారి (బెర్మ్)మీదే నడవాలని సూచించారు. దాన్ని ఆయన అక్షరాలా పాటిస్తున్నా రు. ఇది నియోజకవర్గాల్లోని నాయకులకు కొత్త ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోం ది. ఆయన యాత్ర ఆపాదమస్తకం రోడ్ల కు ఎడమవైపు తుప్పలు తొలగించి గ్రా వెల్ వేసి బెర్మ్‌లు తయారు చేస్తున్నారు. దీనికే లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని నాయకులు లబోదిబోమంటున్నారు. ఇది బహుదూరపు 'బెర్మ్' చారి వెనకున్న ఆసక్తికర ఇతివృత్తం.