April 5, 2013

విద్యుత్ సమస్యపై నిరసనలు

రామగిరి: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించి, కోతలు ఎత్తివేసే వరకు ఉద్యమం ఆగదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్పష్టంచేశారు. గురువారం రామగిరిలో విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ.. విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించి, కాంగ్రెస్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లేక పంటలు ఎండుతున్నాయన్నారు. రాత్రిళ్లు ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు.

ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి పరంధామయాదవ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములునాయక్, నాయకులు నర్రా శ్రీరాములు, నాగరాజు, అక్కులప్ప, గుర్రం శీనా, బాలరాజు, పేపర్ శీనా, మనోహర్, ఆవులముత్యాలు, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

ఇంటి పట్టాలపై తహసీల్దార్‌తో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష: మండల కేంద్రమైన రామగిరిలో ఇంటి పట్టాల జాబితాపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తహసీల్దార్ వసంత్‌కుమార్‌తో సమీక్షించారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని సూచించారు. తయారైన జాబితాను పరిశీలించారు. వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు