April 5, 2013

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి:టీడీపీ

వినుకొండటౌన్: విద్యుత్ చార్జీలకు నిరసనగా పట్టణంలోని ఆర్‌టీసీ డీపో ఎదుట టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంకు ఆరవ రోజుకు చే రుకున్నాయి. ఆరవ రోజు దీక్షల్లో పట్టణానికి చెందిన పలువురు వికలాంగు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ విద్యుత్ కోతల వల న తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే ఈ సమస్యను ప రిష్కరించాలని కోరారు.

ఈ రిలేనిరాహార దీక్షల్లో పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు మాట్లాడు తూ పెంచిన చార్జీలు, అప్రకటిత కోత ల వలన ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారని ప్రభుత్వం ఈ సమస్య పై నిర్లక్ష్య దోరణి వీడనాడాలన్నారు. దీక్షలో కె.రాజుయాదవ్, ఉట్లూరి మేరి, నంబూరి ఎలియ్య, జొన్నల గడ్డ వెంకయ్య పలువురు వికలాంగులు, డాక్టర్ గోగినేని సాంబశివరావు, తుపాకుల కొండలరెడ్డి, పత్తి పూర్ణచంద్రావు, జివి.రమణ, కరీంసెట్, పల్లమీసాల దాసయ్య, నక్కా వీరారెడ్డి, నలబోతుల శ్రీను పాల్గొన్నారు.

శావల్యాపురంలో...

శావల్యాపురం: విద్యుత్ చార్జీల పెంపుదల, అనధికార కోతలకు నిరసనగా మండల కేంద్రమైన శావల్యాపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు గురువారం చేపట్టారు. శిబిరాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు గడిపూడి విశ్వనాధం ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి ముండ్రు హనుమంతరావు మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేనిపోరాటం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పిచికలపాలెం, ముండ్రువారిపాలెం, చినకంచర్ల గ్రామాలకు చెందిన చెరుకూరి చౌదరి, పారా హైమారావు, శావల్యాపురం సొసైటీ అధ్యక్షులు దివ్యకోలు వెంకయ్య, గోరంట్ల హనుమంతరావు, బోడెపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈపూరులో ...

ఈపూరు: విద్యుత్ చార్జీలు పెంచినందుకు నిరసనగా మండల కేంద్రమైన ఈపూరులో టీడీపీ ఆద్వర్యంలో రిలే నిరహార దీక్షలు గురువారం ప్రారంభించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్రజలపైన ధరల భారాలను మోపుతూ రక్తం పీల్చే జలగల్లా కిరణ్ ప్రభుత్వం తయారైందన్నారు.

దీక్షలో గన్నమనేని వెంకయ్య, అయినాల కోటేశ్వరరావు, సిహెచ్ శేషగిరిరావు, నందిగం అక్కారావు, బోడపాటి రామాంజి మాచర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

బొల్లాపల్లిలో...

బొల్లాపల్లి:విద్యుత్ సమస్యలకు వ్యతిరేఖంగా బొల్లాపల్లిలో ఎన్‌టీఆర్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి రెండవ రోజుకు చేరుకున్నాయి. పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, కరెంటు కోతలను ఎత్తివేయాలని, రైతులకు నిరంతరాయంగా ఏడు గంటలు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు ముందుగా దీక్షను ప్రారంభించారు.

ప్రభుత్వం ప్రజలపై విధించిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దీక్షలో పట్రా పెద్దగాలెయ్య, గుద్దేటి శాంతయ్య,ఎనబర్ల కోటేశ్వరరావు,చిన్న కోటేశ్వరరావు, చెన్నూరు గురవయ్య, పెద్దేటి నాగరాజు, మేడేపల్లి రామయ్య, రాంబాబు,రెడ్డిబోయిన ప్రభుదాసు, దాసారి రాజేష్,ఈ కార్యక్రమంలో షేక్ సుభాని, యాగంటి చంద్రయ్య,గోనుగుంట్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.