April 5, 2013

దీక్ష విరమించిన ఎమ్మెల్యే 'కందుల'

ఒంగోలు కలెక్టరేట్: జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు తక్షణమే సాగర్ జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం పార్టీకి చెందిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆమరణ నిరాహారదీక్ష విరమించారు. కలెక్టరేట్ వద్ద కందుల చేపట్టిన దీక్ష గురువారానికి మూడో రోజుకు చేరిం ది. గురువారం మధ్యాహ్నం సాగర్ జలాలను విడుదల చేసినందున దీక్షను విరమించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.రాధాకృష్ణమూర్తి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన కందుల నారాయ ణరెడ్డి దీక్షను విరమించారు. సాగర్ నీటిని చెరువులకు నింపే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం సాగర్ జలాలు జిల్లాకు చేరిన వెంటనే నీటి చౌర్యం జరగకుం డా అధికారులు ప్రత్యేక చర్యలు తీసు కోవాలని డిఆర్వోను కోరారు. తాను చేపట్టిన దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కందుల కృతజ్ఞతలు తెలిపా రు. కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ యక్కల తులసీరావు, తెదేపా నాయకులు కొమ్మూరి రవిచంద్ర, యానం చిన యోగయ్య యాదవ్, పోగుల సుందరం, కమ్మ వెంకటేశ్వర్లు, లంకా దినకర్‌బాబు, బొల్లినేని వాసు కృష్ణ, కొల్లిపల్లి సురేష్‌తో పాటు పలు వురు తెదేపా నాయకులు ఉన్నారు.

తెదేపా సంబరాలు కాగా కందుల దీక్ష విరమించిన అనంతరం దీక్షా శిబిరం వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీక్షపై స్పందించి వెంటనే సాగర్ జలాలు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా దీక్షా శిబిరం వద్ద పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారు.