January 26, 2013

ప్రతిపనికీ లంచమే

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్న లంచం ఇవ్వాల్సి వస్తున్నదని అంబారుపేట, ఐతవరం ప్రజలు బాబు ఎదుట సమస్యలను ఎకరువు పెట్టారు. తాగునీరు సమస్య, బెల్టుషాపులు, వీధి దీపాలు అంతర్గత రోడ్లు తదితర సమస్యలతో విలవిలాడుతన్నట్టు చెప్పారు. ఇసుక, మద్యం మాఫియా ప్రజాదనాన్ని దండుకుంటూ రాజ్యమేలుతున్నారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం దొంగమయం అయిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. అందుకు యువత ప్రధాన భూమికను పోషించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు పలు ఉద్యోగ సంఘాల నాయకులు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

అడుగడుగునా నీరాజనం అంబారుపేట, ఐతవరం దేశం పార్టీ నాయకులు, కామసాని శ్రీనివాసరావు, ఐలపోగు నాగేశ్వరరావు, చుం డు శేషగిరిరావు, యర్రమాసు అంకురావు, చింతల హుస్సేన్‌లతో పాటు మహిళా కార్యకర్తలు బాబుకు అడుగడుగునా పూలమాలలు, హారతులతో నీరాజనాలు పలికారు. ఐతవరంలో పార్టీ జెండాదిమ్మెను అవిష్కరించారు.

కంచికచర్లరూరల్‌లో.. కీసర చేరుకున్న చంద్రబాబు నాయుడుకు జిల్లా తెలుగు దేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అన్వర్, మండల దేశం పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు, ప్రధాన కార్యదర్శి వేల్పుల రమేష్, జవ్వాజి సైదేశ్వరరావు, సీనియర్ దేశం పార్టీ నాయకుడు కుంటముక్కల శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.