April 3, 2013

కాంగ్రెస్ అసమర్థతతోనే డిస్కంలకు నష్టాలు


నగరి/నాగలాపురం/సత్యవేడు/పిచ్చాటూరు/విజయపురం: కేంద్రరాష్ట్రాల్లోని కాంగ్రెస్ అసమ ర్థ విధానాలతో డిస్కంలు అప్పుల్లో కూరుకుపో యి, ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం పడుతోం దని ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు.  విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా నగరి, నాగలాపురం, సత్యవేడు, పిచ్చా టూరు, విజయపురంలో టీడీపీ, వామపక్ష నేతలు ఆందోళనకు పూనుకున్నారు.

నగరి టవర్‌క్లాక్ సెంటర్ వద్ద జరిగిన మహాధర్నాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ హయాంలో బాబు ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలతో ఉచిత విద్యుత్ అమలు సాధ్యమైందన్నారు. అయితే ఏ సీఎం పెంచని రీతిలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా రూ.32 వేలకోట్ల భారాన్ని విద్యుత్తు చార్జీల రూపంలో మోపారని వాపోయారు. సోనియా దయాదాక్షి ణ్యాలతో దొడ్డి దారిన సీఎం అయిన ఆయన ని యంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం, ఆయన తమ్ముడు రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడుతూ, తన పదవిని కాపాడుకునేందు కు సోనియాకు ముడుపులు చెల్లిస్తున్నారని ఆరో పించారు. ధర్నాలో టీడీపీ నాయకులు పాకారాజ, కృష్ణమూర్తి నాయుడు, పొన్నుస్వామి, సుబ్రహ్మణ్యంరాజు, హరి, గణేష్, బాలాజీ, రమే ష్, వసంత హరినాయుడు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దుచేయాలని కోరు తూ నాగలాపురంలో అఖిల పక్షాలు ఆందోళన జ రిపాయి.

కార్యక్రమంలో నాయకులు ప్రసాద్ రా జు, ప్రభాకర్ నాయుడు, మురళి, నమశివాయ, దేశయ్య, బాబు, నరసరాజు పాల్గొన్నారు. విద్యుత్తు చార్జీల భారం తగదంటూ సత్యవేడులో వామపక్ష నాయకులు ఆందోళనకు పూనుకున్నారు. సీపీఎం మండల కార్యదర్శి అరుణాచలం అధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. సీపీఐ మండల నాయకులు చిన్నిరాజ్, మురళి తదితరులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ప్రభుత్వం అసమర్థ విధానాలే విద్యుత్తు చార్జీల భారంనకు కారణమని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. పిచ్చాటూరులో జరిగిన దీక్షల్లో సీపీఐ మండల కార్యదర్శి కుమార్, సీపీఎం మండల కార్యదర్శి రామచంద్రారెడ్డి, నాయకులు ఉమాపతి, గోవిందరాజులు, రమేష్ పాల్గొన్నారు. పెంచిన విద్యుత్తు బిల్లులు తగ్గించాలని విజయపు రం టీడీపీ నాయకులు పన్నూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. సర్‌చార్జి పేరి ట సామాన్య రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని నాయకులు బాలసుబ్రమణ్యంరాజు, రమణరాజు, దశరథ వాపోయారు.