April 3, 2013

నిజాయితీగా పాలించి ... నిప్పులా బతికా!

తొమ్మిదేళ్లు సీఎంగా నిజాయితీగా పాలన చేశా. ఏ తప్పూ చేయకుండా నిప్పులా బతికాను. మన కార్యకర్తలూ కాంగ్రెస్ దొంగల్లా ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. చాలామంది ఆస్తులు అమ్ముకుని ఆదర్శంగా నిలిచారు. 2014లో అధికారంలోకి వచ్చాకా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్ని ఆదుకుంటాం.. అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వస్తున్నా మీ కోసం 183వ రోజు పాదయాత్ర    సామర్లకోట మండలం అచ్చంపేట నుంచి పిఠాపురం వరకు సాగింది.

అంతకు ముందు అచ్చంపేటలో కాకినాడ అర్భన్, కాకినాడ రూరల్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ విజయానికి కార్యకర్తల నుంచి సూచనలు స్వీకరించారు.

వైఎస్, కాంగ్రెస్ దొంగల వల్ల రాష్ట్రంలో పేదరికం విలయతాండవం చేస్తుందన్నారు. ఆ దుష్టుల పాలన నుంచి విముక్తి కలగాలంటే టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్, కాంగ్రెస్‌ల అవినీతి అక్రమాలను ఊరూరా, ఇంటింటా ప్రచారం చేయాలన్నారు.

భవన నిర్మాణ కార్మికులకు ఇళ్లు అందరికీ ఇళ్లు నిర్మించే కార్
మికులకు ఇళ్లులేవని.. భవన నిర్మాణ కార్మికులకు ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.ఐదు లక్షలకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్మికుల కోసం నేక్ తన హయాంలోనే ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.

వైఎస్ పుత్రోత్సాహమే ఈ దుస్థితికి కారణం


ఒక వ్యక్తి తన కుటుంబం కోసం, పుత్రవాత్సల్యంవల్ల రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని చంద్రబాబు తిమ్మాపురం సభలో ఆక్షేపించారు. కొడుక్కి లక్ష కోట్లు దోచిపెట్టిన వైఎస్ పేదలకు మాత్రం పప్పుబెల్లాలు విదిల్చారన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలు మాఫీపై తొలి సంతకం చేస్తానన్నారు.

మాలల కోసం ప్రత్యేక ప్యాకేజీ

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు తెలిపారు. వర్గీకరణ ద్వారా అణగారిన మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తామన్నారు. మాలలకు అన్యా యం చేయబోమన్నారు. మాల సామాజికవర్గంలోను ఎక్కువమంది పేదలు ఉన్నారని.. వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

బొడ్డు చరిత్ర హీనుడు


30 ఏళ్లు టీడీపీలో అనేక పదవులు అనుభవించి పిల్ల కాంగ్రెస్‌లో చేరిన నాయకుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని బొడ్డు భాస్కరరామారావును ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంచల్‌గూడ జైలుకెళ్లిన జగన్‌పార్టీలో చేరడం బొడ్డుకు ఆత్మగౌరమా అని ప్రశ్నించారు. సామర్లకోట మండలం పవర్ సెంటర్‌లో చంద్రబాబు ప్రజల నుద్దేశించి మాట్లాడారు.