April 3, 2013

విద్యుత్ వ్యస్థను నాశనం చేసిన కాంగ్రెస్

ధర్మవరంరూరల్: అధికార కాంగ్రెస్ పార్టీ స్వార్థప్రయోజనాల కోసం విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ సంక్షోభానికి నిరసనగా రెండో రోజు నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. రెండవ రోజు దీక్షలను వరదాపురం సూరి ప్రారంభించడమే కాక బ్లాక్ పేపర్‌తో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కోటి సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరదాపురం సూరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు లేకపోవడం వల్లే నేడు విద్యుత్ సంక్షోభం తీవ్ర రూపందాల్చుతోందన్నారు.

కిరణ్ సర్కార్‌కు విద్యుత్ వినియోగంపై అవగాహన లేకపోవడం వల్లనే ప్రజలు, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు కరెంట్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో సైతం ప్రజలు తాగునీరు కావాలని అడుగుతున్నారంటే ఎంత దమనీయ పరిస్థితి ఉందో అర్థమవుతోందన్నారు. టీడీపీ హయాంలో ఏనాడు కూడా కరెంట్ కోసం ఎదురుచూసిన పాపానా పోలేదన్నారు. నిరంతరాయంగా తొమ్మిది గంటలు వ్యవసాయానికి విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు ఏకకాలంలో విద్యుత్‌ను సరఫరా చేయడం వల్ల రైతులు పంటలు సాగుచేసుకోవడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, బీరేగోపాలకృష్ణ, మద్దిలేటి, బోయరవి, చిప్పలమల్లికార్జున, ఇనయ్‌తుల్లా, కేహెచ్‌ప్రకాశ్, ఉడుములరాము, రాయపాటి రామకృష్ణ, బెస్తశివ, బోడెగల గిరిదర్, బోడెగల ప్రభాకర్, రాళ్ళపల్లి బాబు, మద్దక మల్లికార్జున, బీమనేని విజయసారధి చౌదరి, ముల్లాషెక్షావలి, బోడెగల గిరిదర్, రేగాటిపల్లి నాగేంద్రరెడ్డి, ముచ్చరామి కిష్ట, జంగంనరసింహులు, శ్రీశైలంపురుషోత్తంగౌడ్, డిష్‌లచ్చి, కనుముక్కలనారాయణ, మల్లాకాల్వరాముడు, మహిళా నాయకురాలుసాహెబ్బీ, బీబీ, మద్దకరమాదేవి తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు దీక్షలో చారుగుండ్ల ఓబులేసు, రహంతుల్లా, నజీర్‌ఖాన్, పామిశెట్టి శివశంకర్, మునుస్వామి, అన్నంశీన, శీలామూర్తి తదితరులు పాల్గొన్నారు.

దీక్షలకు హనుమంతరాయచౌదరి మద్దతు

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలను విపక్షాలతో పాటు అధికార పక్షంలోని వారు కూడా విమర్శిస్తు న్నా ముఖ్యమంత్రికి మాత్రం దున్నపోతుమీద వర్షం కురిసిట్టు ఉందని టీ డీపీ రైతు సంఘం నాయకుడు హనుమంతరాయచౌదరి విమర్శించారు. వి ద్యుత్ సంక్షోభంతో పాటు పెరుగుతు న్న విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ధర్మవరంలో వరదాపురంసూరి ఆధ్వర్యం లో చేపడుతున్న దీక్షలు మంగళవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు హనుమంతరాయచౌదరి సం పూర్ణమద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యు త్ సంక్షోభంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆ యన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం కళ్లు తెరచి రాష్ట్ర ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2014లో చంద్రబాబునాయడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు.